Paytm : వావ్..పేటీఎంలో కొత్త ప్రైవసీ ఫీచర్.. ఇక మీ పేమెంట్లు సీక్రెట్‌గా దాచేయొచ్చు!

Paytm : పేటీఎం యూజర్ల కోసం సరికొత్త ప్రైవసీ ఫీచర్ వచ్చేసింది. మీ పేమెంట్ హిస్టరీలో ఏదైనా ట్రాన్సాక్షన్ సీక్రెట్ గా ఉంచుకోవాలంటే ఈ ఫీచర్ అద్భుతంగా ఉపయోగడపడుతుంది.

Paytm Payment History

  • భారత్‌లో పేటీఎం యూజర్లు అత్యధికంగా వాడే డిజిటల్ పేమెంట్ యాప్
  • పేటీఎం పేమెంట్ యాప్ లావాదేవీలను హైడ్ చేసే ఫీచర్ అందుబాటులో
  • మీరు పేటీఎంలో మీ లావాదేవీలను ఈజీగా హైడ్ చేయొచ్చు

Paytm : పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. భారతీయ పేటీఎం యూజర్ల కోసం అద్భుతమై ప్రైవసీ ఫీచర్ అందిస్తోంది. ఈ డిజిటల్ పేమెంట్ యాప్ ద్వారా మీ రోజువారీ లావాదేవీల పూర్తి వివరాలను యాప్‌లోనే అందిస్తుంది. మీరు అకౌంటింగ్ కోసం ఎక్కడా రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. అయితే, మీరు కొన్ని పేమెంట్లను ఎవరికి కనిపించకుండా హైడ్ చేయాలనుకుంటే ఈజీగా చేయొచ్చు.

ఈ డిజిటల్ పేమెంట్ యాప్ అద్భుతమైన ఆప్షన్ అందిస్తుంది. పేటీఎం ‘హైడ్ పేమెంట్’ ఫీచర్ (Paytm Digital payments ) బెస్ట్ ఆప్షన్. వినియోగదారులు కొన్ని లావాదేవీలను కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఎక్కువ మంది పేటీఎం యూజర్లు తమ పేమెంట్ వివరాలను ప్రైవసీగా ఉంచుకోవచ్చు. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? ఎలా హైడ్ చేయాలో ఇప్పుడు మరింత తెలుసుకుందాం..

పేటీఎంలో పేమెంట్ ఫీచర్‌ను ఎలా హైడ్ చేయాలి? :
పేటీఎంలో హైడ్ పేమెంట్లు (Hide Payments) అనేది డిజిటల్ పేమెంట్ల కోసం ప్రైవసీ, పర్సనలైజడ్ ఫీచర్. మీరు హైడ్ చేసిన లావాదేవీలను డిలీట్ చేయడం లేదా మార్చడం కుదరదు. అందుకు స్పెషల్ సెక్షన్‌లో స్టోర్ అవుతాయి. ఇలాంటి లావాదేవీలు పూర్తిగా సేఫ్. అవసరమైనప్పుడు వాటిని చూడవచ్చని పేటీఎం పేర్కొంది.

Read Also : Amazon Great Summer Sale : బంపర్ డీల్ అలర్ట్.. అమెజాన్ సేల్‌లో వన్‌ప్లస్, షావోమీ టాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు.. మిస్ అవ్వకండి!

పేటీఎంలో పేమెంట్లను ఎలా హైడ్ చేయాలి? :

  • మీ ఫోన్‌లో పేటీఎం యాప్‌ను ఓపెన్ చేయండి.
  • బ్యాలెన్స్, హిస్టరీ ట్యాబ్‌కు వెళ్లండి.
  • మీరు హైడ్ చేసే పేమెంట్‌పై లెఫ్ట్ సైడ్ స్వైప్ చేయండి.
  • మీరు స్క్రీన్‌పై కనిపించే హైడ్ ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
  • (Yes)పై ట్యాప్ చేసి కన్ఫార్మ్ చేయండి. ఆపై పేమెంట్ హైడ్ చేయండి.
  • ఇప్పుడు ఈ పేమెంట్ మీ పేమెంట్ హిస్టరీలో కనిపించదు.

పేటీఎంలో పేమెంట్ ఎలా హైడ్ చేయాలి? :

  • మీరు బ్యాలెన్స్, హిస్టరీ ట్యాబ్‌కు వెళ్లండి.
  • స్క్రీన్ రైట్ టాప్ కార్నర్‌లో ఉన్న త్రి డాట్స్ ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
  • స్క్రీన్ రైట్ టాప్ కార్నర్ త్రి డాట్స్ ఐకాన్ ట్యాప్ చేసి మెను నుంచి ‘View Hided Payments’ని ఎంచుకోండి.
  • మీ ఫోన్ పిన్‌ను ఎంటర్ చేయండి లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయండి.
  • అప్పుడు మీ సీక్రెట్ పేమెంట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • అన్‌హైడ్ చేసే లావాదేవీపై లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసి ఆపై అన్‌హైడ్ ట్యాప్ చేయండి.
  • గతంలో హైడ్ చేసిన పేమెంట్ ఇప్పుడు మీ పేమెంట్ హిస్టరీలో కనిపిస్తుంది.