Top Bank Car Loans : కారు లోన్ తీసుకుంటున్నారా? చౌకైన వడ్డీ రేట్లు అందించే టాప్ బ్యాంకులివే.. ఎందులో వడ్డీ ఎంతంటే?
Top Bank Car Loans : కొత్త కారు లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? మే 2026లో ఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లతో కారు లోన్లు అందిస్తున్నాయో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం..
- Sreehari A
- Published on- May 16, 2026 / 04:44 PM IST
Top Bank Car Loans ( Image Credit : Gemini AI )
- మే 2026లో కారు లోన్ తీసుకుంటున్నారా?
- చౌకైన వడ్డీ రేట్లతో కారు లోన్లు అందించే బ్యాంకులు
- ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో కారు లోన్ వడ్డీ రేట్లు
Top Bank Car Loans : మే నెలలో కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? కొత్త కారు లోన్ ద్వారా తీసుకోవాలనుకుంటే ఇది మీకోసమే. మీరు ముందుగా దేశంలోని వివిధ బ్యాంకుల కారు లోన్ వడ్డీ రేట్ల గురించి తప్పక తెలుసుకోవాలి.
ఆ తర్వాత, తక్కువ వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకు నుంచి కారు లోన్ తీసుకోవచ్చు. మే 2026లో దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఏయే వడ్డీ రేట్లకు కారు లోన్లు అందిస్తున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మే 2026లో ప్రభుత్వ రంగ బ్యాంకుల కారు లోన్ వడ్డీ రేట్లు :
- యూనియన్ బ్యాంక్ : 7.60 శాతం
- బ్యాంక్ ఆఫ్ బరోడా : 7.60 శాతం
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ : 7.65 శాతం
- కెనరా బ్యాంక్ : 7.95 శాతం
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) : 8.90 శాతం
మే 2026లో ప్రైవేట్ బ్యాంక్ కారు లోన్ వడ్డీ రేట్లు :
- ఐడీబీఐ బ్యాంక్ : 7.75 శాతం
- ఐసీఐసీఐ బ్యాంక్ : 8.50 శాతం
- యాక్సిస్ బ్యాంక్ : 8.95 శాతం
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ : 9.00 శాతం
- ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ : 9.99 శాతం
కారు లోన్ కోసం ముఖ్యమైన విషయాలు :
ఏ బ్యాంకు నుంచి అయినా కార్ లోన్ తీసుకునే ముందు కేవలం వడ్డీ రేటును మాత్రమే చూడకండి. వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ ఛార్జీల వంటి ఇతర ఛార్జీలను కూడా లెక్కలోకి తీసుకోండి.
కార్ లోన్ తీసుకునే ముందు మీ క్రెడిట్ స్కోర్ పెంచుకునేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేటుకే లోన్ పొందవచ్చు. లోన్ తీసుకునే ముందు ఫ్లోటింగ్, ఫిక్స్‌డ్ వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకుని సరైనది ఎంచుకోండి.
లాంగ్ టర్మ్ లోన్ తీసుకుంటే ఈఎంఐలు తగ్గుతాయి. కానీ, పేమెంట్ చేసే మొత్తం వడ్డీ ఎక్కువగా ఉంటుంది. అందుకే మీ ఆదాయాన్ని చూసుకుని సరైన నిర్ణయం తీసుకోండి.
