Maruti Car April Offers : మారుతి సుజుకి బంపర్ డిస్కౌంట్లు.. ఈ ఏప్రిల్‌లో ఆల్టో నుంచి బ్రెజ్జా వరకు రూ. 45వేల వరకు తగ్గింపు.. ఫుల్ డిటెయిల్స్

Maruti Car April Offer : కొత్త మారుతి సుజుకి కారు కొనేవారికి అద్భుతమైన ఆఫర్. ఈ ఏప్రిల్‌లో ఎరీనా షోరూమ్‌ల నుంచి విక్రయించే అనేక కార్లపై మారుతి సుజుకి భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. పూర్తి వివరాలివే..

Maruti Car April Offer

  • ఈ ఏప్రిల్ నెలలో మారుతి సుజుకి కార్లపై భారీ డిస్కౌంట్లు
  • కొత్త మారుతి కారు కొంటే ఏకంగా రూ. 45వేల వరకు ఆదా
  • ఏయే మారుతి కార్లపై ఎంతవరకు డిస్కౌంట్ పొందవచ్చు?

Maruti Car April Offer : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీరు మారుతి కారు ప్రియులైతే ఈ ఆఫర్ మీకోసమే. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ ఏప్రిల్‌లో అనేక కార్లపై అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. మీరు మారుతి కారు కొనాలంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.

ఈ ఏప్రిల్‌లో ఎరీనా షోరూమ్‌ల నుంచి విక్రయించే అనేక కార్లపై మారుతి సుజుకి  (Maruti Car April Offers) ఆకట్టుకునే ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల ద్వారా వినియోగదారులు రూ. 45వేల వరకు అద్భుతమైన బెనిఫిట్స్ పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా తెలుసుకుందాం..

మారుతి సుజుకి ఎరీనాలో కార్లు ఏంటి? :
మారుతి సుజుకి ఎరీనా డీలర్‌షిప్‌ల ద్వారా అనేక ప్రముఖ కార్లను విక్రయిస్తుంది. ఇందులో మారుతి సుజుకి K10, మారుతి సుజుకి వాగన్R, మారుతి సుజుకి స్విఫ్ట్, మారుతి సుజుకి బ్రెజ్జా, మారుతి సుజుకి ఈకో ఉన్నాయి. ఈ నెలలో ఈ కార్లపై భారీ తగ్గింపుతో కొనేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఏప్రిల్ 30, 2026 వరకు అందుబాటులో ఉంటుంది.

Read Also : Vivo X300 Ultra : వివో ఫ్యాన్స్ గెట్ రెడీ.. కొత్త వివో X300 అల్ట్రా వచ్చేస్తోందోచ్.. లాంచ్ డేట్, ధర, కీలక ఫీచర్లు లీక్..

మారుతి సుజుకి కార్లపై తగ్గింపు ఆఫర్లు :
ఈ ఏప్రిల్‌లో పలు కార్లపై మారుతి సుజుకి భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బోనస్‌లు, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్, సంస్థాగత ఆఫర్లు, గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లు ఇలా ఉన్నాయి.

  • మారుతి సుజుకి ఆల్టో K10 : రూ. 37,500
  • మారుతీ సుజుకి S-ప్రెస్సో : రూ. 37,500
  • మారుతీ సుజుకి వ్యాగన్ఆర్ : రూ. 37,500
  • మారుతీ సుజుకి సెలెరియో : రూ. 37,500
  • మారుతి సుజుకి స్విఫ్ట్ : రూ. 45,000
  • మారుతీ సుజుకి బ్రెజా : రూ. 45,000
  • మారుతీ సుజుకి విక్టోరిస్ : రూ. 30,000
  • మారుతి సుజుకి ఈకో : రూ. 37,500

మారుతి సుజుకి డిజైర్, ఎర్టిగా కార్లపై ఎలాంటి ఆఫర్లు లేవు. డిజైర్, ఎర్టిగా మారుతి సుజుకి అత్యధికంగా అమ్ముడయ్యే కార్లుగా చెప్పొచ్చు.