PM E-Drive Scheme : బయ్యర్లకు బ్యాడ్ న్యూస్! ఈ-స్కూటర్ల సబ్సిడీ సగానికి కోత.. స్కీమ్ 2028 వరకు పొడిగింపు!

PM E-Drive Scheme : పీఎం ఇ-డ్రైవ్ పథకాన్ని 2028 మార్చి 31 వరకు పొడిగించారు. అయితే, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఇచ్చే ప్రోత్సాహకాలను భారీగా తగ్గించారు. ఈవీ కొనుగోలుదారులు ఈ పథకం ద్వారా బెనిఫిట్ పొందినా గతంలో కన్నా తక్కువ సబ్సిడీనే పొందుతారు.

PM E-Drive Scheme

  • 2028 మార్చి 31 వరకు పీఎం ఇ-డ్రైవ్ స్కీమ్ పొడిగింపు
  • గంటకు (kWh) ఇచ్చే ప్రోత్సాహకాన్ని సగానికి తగ్గింపు
  • ఈ మొత్తం పథకంపై రూ.11,900 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు

PM E-Drive Scheme : ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. పీఎం ఇ-డ్రైవ్ పథకాన్ని ఇప్పుడు మార్చి 31, 2028 వరకు పొడిగించారు. అయితే, ఈవీ టీవీలర్ కొనుగోలుదారులకు లభించే సబ్సిడీని భారీగా తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి కిలోవాట్-గంటకు (kWh) ఇచ్చే ప్రోత్సాహకాన్ని సగానికి తగ్గించింది. దాంతో ఈవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నవారు ఈ కొత్త విధానాన్ని తప్పక అర్థం చేసుకోవాలి.

భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. పీఎం ఇ-డ్రైవ్ పథకం (PM E-Drive Scheme) ఇప్పుడు మార్చి 31, 2028 వరకు కొనసాగుతుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఈవీ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.

ఈ మొత్తం పథకం కోసం ప్రభుత్వం రూ.11,900 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అయితే, నిధుల పరిమితితోనే పథకం అందుబాటులో ఉంది. అందుకే కేటాయించిన నిధులు అయిపోతే ఈ పథకాన్ని లేదా అందులోని ఏ భాగమైనా ముందుగానే నిలిపివేయొచ్చు.

Read Also : Amazon Great Freedom Sale : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? ఆసుస్ వివోబుక్ 15పై ఏకంగా రూ.10వేలకుపైగా తగ్గింపు!

ఈవీ టూలర్ సబ్సిడీ సగానికి తగ్గింపు :
కొత్త విధానం ప్రకారం.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఇచ్చే ప్రోత్సాహకాన్ని ప్రతి kWhకు రూ.5వేల నుంచి రూ.2,500కు తగ్గించారు. అంతేకాదు.. ప్రతి వాహనానికి గరిష్ట ప్రోత్సాహకం ఇప్పుడు రూ.5వేలుగా ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇ-టూవీలర్ గతంలో ప్రతి kWhకు రూ.5వేలు చొప్పున గరిష్టంగా రూ.10వేల వరకు ప్రోత్సాహకాన్ని అందించేవారు. కానీ, ఇప్పుడు గరిష్ట ప్రయోజనం సగానికి తగ్గింది.

ఏయే ఈవీ బెనిఫిట్ పొందొచ్చు:
ప్రోత్సాహకానికి అర్హత పొందాలంటే.. ఎలక్ట్రిక్ టూవీలర్ టాప్ ఎక్స్-ఫ్యాక్టరీ ధరను రూ.1.5 లక్షలుగా నిర్ణయించారు. ఇందుకోసం మొత్తం రూ.2,767 కోట్ల నిధులను కేటాయించారు. అయితే, ఈ ప్రోత్సాహకం నిర్దేశించిన లిమిట్ వరకు లేదా వాహనం ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో 15శాతం వరకు మాత్రమే లభిస్తుంది, ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది వర్తిస్తుంది. వాహనాల ధరలలో మార్పులను బట్టి ప్రభుత్వం ప్రతి kWh ప్రోత్సాహకాన్ని కూడా తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు.

2027 చివరి నాటికి క్లెయిమ్ గడువు :
పీఎం ఇ-డ్రైవ్ పథకానికి మార్చి 31, 2028 గడువు తేదీ కాగా, ఈ పథకం కింద ఏ పార్టుపైనా క్లెయిమ్‌లను సబ్మిట్ చేయొచ్చు. ఇందుకోసం చివరి తేదీ డిసెంబర్ 31, 2027 మాత్రమే.. కంపెనీలు, సంబంధిత లబ్ధిదారులు ఈ గడువు తేదీని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.