PM Jan Dhan Yojana : మీ అకౌంట్‌లో డబ్బులు లేకున్నా రూ. 10వేలు విత్ డ్రా చేయొచ్చు.. జస్ట్ ఈ ప్రభుత్వ స్కీమ్‌లో అప్లయ్ చేస్తే చాలు..!

PM Jan Dhan Yojana : మీ బ్యాంకు అకౌంటులో డబ్బులు లేకపోయినా ఈ పీఎం జన్ ధన్ యోజన పథకం ద్వారా సులభంగా రూ. 10వేలు తీసుకోవచ్చు.

PM Jan Dhan Yojana

PM Jan Dhan Yojana : మీ సేవింగ్స్ అకౌంటు ఉందా? అందులో డబ్బు లేకపోయినా మీరు బ్యాంకు నుంచి రూ. 10వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని పొందడానికి మీకు జన్ ధన్ ఖాతా ఉండాలి. జన్ ధన్ ఖాతాను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2017 సంవత్సరంలో ప్రారంభించింది.

Read Also : Emergency Gadgets : యుద్ధం వంటి ఎమర్జెన్సీ సమయంలో భారతీయుల దగ్గర ఉండాల్సిన 5 ముఖ్యమైన గాడ్జెట్లు ఇవే..!

ప్రధాన్ మంత్రి జన్‌ధన్ యోజన కింద బ్యాంకు ఖాతా తెరిచినప్పుడు చెక్ బుక్, పాస్ బుక్, ప్రమాద బీమా వంటి అనేక రకాల బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

వీటన్నింటితో పాటు వినియోగదారులు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా పొందుతారు. బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ లేకపోయినా అవసరమైతే మీరు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ పథకం కింద బ్యాంకు ఖాతాలు జీరో బ్యాలెన్స్ ఖాతాలో తెరిచే అవకాశం ఉంది. మీ ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకపోయినా మీరు దానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ పథకంలో బీమాతో సహా అనేక రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ జీరో బ్యాలెన్స్ ఖాతా కోట్లాది మందికి పొదుపు ఖాతా, బీమా, పెన్షన్ వంటి ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు.

రూ. 10 వేలు ఇలా విత్‌డ్రా చేయొచ్చు :
జన్ ధన్ యోజన కింద మీ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోయినా మీరు రూ. 10వేల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందుతారు. స్వల్పకాలిక రుణం లాంటిది. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందడానికి మీ జన్ ధన్ ఖాతా కనీసం 6 నెలల పాతది అయి ఉండాలి. మీరు రూ. 2వేల వరకు మాత్రమే ఓవర్‌డ్రాఫ్ట్ పొందవచ్చు. ఈ ఖాతాలో ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయానికి గరిష్ట వయోపరిమితి 65 ఏళ్లు ఉంటుంది.

ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందడానికి మీరు బ్యాంకుకు నామమాత్రపు వడ్డీని చెల్లించాలి. కానీ, ఇది తక్కువ ఆదాయ గ్రూపు కస్టమర్ల చిన్న అవసరాలకు సులభంగా ఉంటుంది. అదనపు డాక్యుమెంట్లు, ఫైళ్లు అవసరం లేకుండానే ఈ డబ్బును వినియోగించుకోవచ్చు.

Read Also : Mother’s Day 2025 : మదర్స్ డే టెక్ గిఫ్ట్ ఐడియాస్.. రూ. 10వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. శాంసంగ్, వివో, మోటోరోలా ఏదైనా గిఫ్ట్ ఇవ్వొచ్చు!

అర్హతలివే :
జన్ ధన్ ఖాతాను తెరిచేందుకు మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండాలి. ఖాతా తెరిచేందుు కనీస వయస్సు 10 ఏళ్లు. ఇది మాత్రమే కాదు, మీరు మీ పాత సేవింగ్ అకౌంట్ కూడా జన్ ధన్ ఖాతాగా మార్చుకోవచ్చు.