Mother’s Day 2025 : మదర్స్ డే టెక్ గిఫ్ట్ ఐడియాస్.. రూ. 10వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. శాంసంగ్, వివో, మోటోరోలా ఏదైనా గిఫ్ట్ ఇవ్వొచ్చు!

Mother’s Day 2025 : మదర్స్ డే రోజున మీ మదర్‌ను ఏదైనా మొబైల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నారా? ఈ ఫోన్లలో ఒక ఫోన్ ఎంచుకోండి.

Mother’s Day 2025 : మదర్స్ డే టెక్ గిఫ్ట్ ఐడియాస్.. రూ. 10వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. శాంసంగ్, వివో, మోటోరోలా ఏదైనా గిఫ్ట్ ఇవ్వొచ్చు!

Mother’s Day 2025

Updated On : May 10, 2025 / 6:52 PM IST

Mother’s Day 2025 : మే 12న ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే జరుపుకుంటారు. మీ అమ్మకు ఏదైనా కొత్త ఫోన్ బహుమతిగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. అతి తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్లను గిఫ్ట్ (Mother’s Day 2025)గా ఇవ్వొచ్చు.

Read Also : Jio Offers : జియో యూజర్లకు పండగే.. ఈ ప్లాన్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 200GB హైస్పీడ్ డేటా, ఫ్రీగా OTT బెనిఫిట్స్!

రూ. 10వేల కన్నా తక్కువ ధరకే అత్యుత్తమ ఫీచర్లు కలిగిన కొన్ని బ్రాండెడ్ ఫోన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఆన్‌లైన్‌లో సులభంగా ఆర్డర్ చేసి ఇంటికి తీసుకెళ్లి మీ మదర్‌కు బహుమతిగా ఇవ్వొచ్చు.

శాంసంగ్ A14 5G :
దక్షిణ కొరియా టెక్ బ్రాండ్ శాంసంగ్ అత్యంత ఆకర్షణీయమైన ఫోన్. మీరు కూడా ఈ బ్రాండ్ ఫోన్‌ను మీ తల్లికి, సోదరికి లేదా ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలనుకుంటే.. ఇది చాలా బెస్ట్ ఆప్షన్. మీరు 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ. 9,749 ధరకు కొనుగోలు చేసి మీ సొంతం చేసుకోవచ్చు.

వివో T3 లైట్ 5G :
వివో ఫోన్లు కూడా ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగి ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఫోన్ మీకోసమే. మీరు ఈ వివో ఫోన్ రూ. 9,499 ధరకు కొనుగోలు చేయవచ్చు. 5000mAh బ్యాటరీతో IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.

మోటోరోలా G45 5G :
మోటోరోలా బెస్ట్ సెల్లింగ్ 5G ఫోన్. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్‌తో కూడా వస్తుంది.

మీరు ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లో రూ. 10వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేసి మదర్స్ డే సందర్భంగా బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ ఫోన్ స్పెషాలిటీ ఏమిటంటే మీరు ఇందులో ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 6s జనరేషన్ 3 వేగంగా రన్ అవుతుంది.

Read Also : Emergency Gadgets : యుద్ధం వంటి ఎమర్జెన్సీ సమయంలో భారతీయుల దగ్గర ఉండాల్సిన 5 ముఖ్యమైన గాడ్జెట్లు ఇవే..!

పోకో M6 5G :
పోకో బడ్జెట్ ఫోన్లకు డిమాండ్ ఎక్కువ. మీరు మదర్స్ డే నాడు మీ మదర్‌‌కు మంచి కెమెరా ఫోన్‌ను గిఫ్ట్‌‌గా ఇవ్వాలనుకుంటే పోకో M6 ఫోన్ మీకు బెస్ట్ ఆప్షన్. ఇందులో 50MP కెమెరా ఉంది. ధర కూడా తక్కువే. ఈ ఫోన్ కేవలం రూ. 7200కి కొనుగోలు చేయవచ్చు.