Jio Offers : జియో యూజర్లకు పండగే.. ఈ ప్లాన్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 200GB హైస్పీడ్ డేటా, ఫ్రీగా OTT బెనిఫిట్స్!
Jio Offers : రిలయన్స్ జియో 98 రోజుల అన్‌లిమిటెడ్ కాల్స్, 200GB డేటా, రోజుకు 100SMS, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, ఫ్రీ 5G డేటాను అందిస్తుంది.

Jio Recharge Offers
Jio Offers : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో రిలయన్స్ జియో ఒకటి. 43 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగిన జియో రూ. 900 కన్నా తక్కువ ఖర్చుతో ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది.
టెలికాం టారిఫ్‌ల పెంపుతో వినియోగదారులు నెలవారీ రీఛార్జ్‌లకు బదులుగా లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్లపై ఆసక్తి చూపిస్తున్నారు. యూజర్ల డిమాండ్ బట్టి జియో ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ తీసుకొచ్చింది.
జియో రూ.899 ప్లాన్ : జియో ప్రీపెయిడ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ డేటాతో పాటు 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
- అన్ని లోకల్, STD నంబర్లకు అన్‌లిమిటెడ్ కాలింగ్
- రోజుకు 100 SMS
- రోజుకు 2GB డేటా, మొత్తం 180GB
- అదనంగా 20GB బోనస్ డేటా, మొత్తం 200GB
- OTT, క్లౌడ్ స్టోరేజీ బెనిఫిట్స్
- 90 రోజుల పాటు ఫ్రీ జియో సినిమా (హాట్‌స్టార్) సబ్‌స్క్రిప్షన్
- 50GB జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్
- లైవ్ టీవీ ఛానెల్స్ కోసం జియోటీవీ యాక్సెస్
- అర్హత కలిగిన జియో యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటా
ఈ రీఛార్జ్ ప్లాన్ ఎవరు అర్హులు? :
ఈ ప్లాన్ OTT స్ట్రీమింగ్‌ను ప్రయాణంలో లేదా తరచుగా రీఛార్జ్‌లు చేసే వినియోగదారుల కోసం అందిస్తోంది. జియో 336 రోజుల వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది.
తద్వారా వినియోగదారుడు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను పొందవచ్చు. కానీ, ఇందులో నెలకు 50 ఫ్రీ ఎస్ఎంఎస్ కూడా ఉన్నాయి. ఏ నెట్‌వర్క్‌కైనా పంపవచ్చు. మొత్తం 24GB హై-స్పీడ్ డేటా, నెలకు 2GBకి వరకు పొందవచ్చు.
అలాగే, రూ.895 రీఛార్జ్ ప్లాన్ జియోఫోన్, జియో భారత్ ఫోన్ యూజర్లకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. మీరు సాధారణ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తుంటే.. ఈ ప్లాన్ వర్తించదు. అయితే, నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిన వినియోగదారులు జియోఫోన్‌కు మారడం ద్వారా బెనిఫిట్ పొందవచ్చు.