Lava Agni 3 : వారెవ్వా.. డిస్కౌంట్ అదిరింది.. అతి చౌకైన ధరకే డ్యూయల్ స్క్రీన్ లావా అగ్ని 3 కొనేసుకోండి.. డోంట్ మిస్!
Lava Agni 3 : లావా అగ్ని 3 ఫోన్ తక్కువ ధరకే కొనేసుకోండి. ఈ 5G ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరింత తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Lava Agni 3
Lava Agni 3 : కొత్త లావా ఫోన్ కావాలా? మిడ్-రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. లావా అగ్ని 3 తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. గత ఏడాదిలో అక్టోబర్‌లో ఈ లావా ఫోన్ లాంచ్ కాగా మొత్తం 3 వేరియంట్‌లలో లభ్యమవుతుంది.
8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో కూడిన బేస్ మోడల్ ధర రూ. 20,999కు అందుబాటులో ఉంది. అయితే, ఈ వెర్షన్‌లో ఛార్జింగ్ అడాప్టర్ లేదు. ఛార్జర్ కూడా కావాలంటే రూ. 22,999కి కొనుగోలు చేయాలి.
256GB స్టోరేజ్, ఛార్జర్‌తో కూడిన టాప్-టైర్ వేరియంట్ ధర రూ. 24,999కు ఆఫర్ చేస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు లావా ఫ్లాట్ రూ. 5వేలు తగ్గింపును అందిస్తోంది.
లావా అగ్ని 3పై డిస్కౌంట్ :
మీరు అమెజాన్‌లో లావా అగ్ని 3 ఫోన్ కొనుగోలు చేయొచ్చు. కొనుగోలుదారులు HDFC, ICICI లేదా Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో లావాదేవీలు లేదా క్రెడిట్ కార్డ్ ఈఎంఐల కోసం ఇన్‌స్టంట్ రూ. 5వేలు తగ్గింపును పొందవచ్చు.
ఈ ప్రత్యేక ఆఫర్ లావా అగ్ని 3 ఫోన్ కేవలం రూ. 15,999కి తగ్గిస్తుంది. రూ.19,900 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.5వేలు తగ్గింపును పొందవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,999కి తగ్గుతుంది. అయితే, కచ్చితమైన విలువ మీ పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని గమనించాలి.
లావా అగ్ని 3 స్పెసిఫికేషన్లు :
లావా అగ్ని 3 ఆకట్టుకునే డ్యూయల్ అమోల్డ్ డిస్‌ప్లేలను కలిగి ఉంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, బ్యాక్ సైడ్ 1.74-అంగుళాల 2D అమోల్డ్ డిస్‌ప్లే ఉన్నాయి.
మీడియాటెక్ డైమన్షిటీ 7300X ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఫోటోగ్రఫీ పరంగా ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP సోనీ సెన్సార్, 3X ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో లెన్స్, సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరాతో 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ 5000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. అన్నీ ప్రీమియం హీథర్ లేదా ప్రిస్టీన్ గ్లాస్ డిజైన్‌తో వస్తుంది.
అదనపు ఫీచర్లలో కస్టమైజడ్ యాక్షన్ కీ, డాల్బీ అట్మాస్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 14 5G బ్యాండ్‌లకు సపోర్టు ఇస్తాయి. ప్రీమియం యూజర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14లో రన్ అయ్యే 3 OS అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. హోం అసిస్టెన్స్ కోసం AGNI మిత్రను అందిస్తుంది.