Vivo V50 Elite : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. వివో V50 ఎలైట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?
Vivo V50 Elite : వివో V50 ఎలైట్ ఫోన్ లాంచ్ కానుంది. అతి త్వరలో భారత మార్కెట్లోకి ఎంట్రీ కానుంది. ఫీచర్లు, ధర పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Vivo V50 Elite
Vivo V50 Elite Launch : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో V50 స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను వివో V50 ఎలైట్‌తో విస్తరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాబోయే స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన వివో V50, వివో V50e ఫోన్ లైనప్‌లో చేరనుంది.
అధికారిక సమాచారం అందుబాటులో లేనప్పటికీ, ఇటీవలి నివేదిక ప్రకారం.. వివో V50 ఎలైట్‌లో వివో V50 మాదిరిగానే ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అయితే, డిజైన్‌లో భిన్నంగా ఉండవచ్చు.
వివో V50 ఫ్రంట్ సైడ్ పంచ్-హోల్‌తో క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే, బ్యాక్ సైడ్ కీహోల్ షేప్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. పుకార్లు ఉన్న వివో V50 ఎలైట్ గురించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
వివో V50 ఎలైట్ లాంచ్ టైమ్‌లైన్ (పుకార్లు) :
నివేదిక ప్రకారం.. మే 15న భారత మార్కెట్లో వివో V50 ఎలైట్ ఎడిషన్‌ను ప్రారంభించవచ్చు. అయితే, కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలను షేర్ చేయలేదు.
వివో V50 ఎలైట్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
రాబోయే వివో V50 వెనిల్లాకు సమానమైన ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల FHD+ క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, 4,500 నిట్‌ల ఆకట్టుకునే పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ 2392×1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందించవచ్చు. పర్ఫార్మెన్స్ కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను పొందుతుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్OS 15లో రన్ అవుతుంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్ OISతో 50MP ప్రైమరీ కెమెరా, బ్యాక్ సైడ్ 50MP వైడ్-యాంగిల్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ సెన్సార్‌తో రావచ్చు.
అదనంగా, ఈ ఫోన్ 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని అందిస్తుంది. లీకైన ఇతర వివరాలలో IP68, IP69 రేటెడ్ వాటర్, డస్ట్ నిరోధకతతో వస్తుంది.
వివో V50 ఎలైట్ ధర (అంచనా) :
వివో V50 8GB/128GB వేరియంట్ ధర రూ. 34,999 కు లాంచ్ అయింది. వివో V50 ఎలైట్ వెనిల్లా మోడల్ కన్నా ఖరీదైనదిగా ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర దాదాపు రూ. 40వేల వరకు ఉండవచ్చు.