Samsung Galaxy S24 Ultra : అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ధర తగ్గిందోచ్.. ఇలా చేస్తే తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.. డోంట్ మిస్!

Samsung Galaxy S24 Ultra : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ ఇప్పుడు అత్యల్ప ధరకు రూ. 84,999 నుంచి ప్రారంభమవుతుంది.

Samsung Galaxy S24 Ultra : అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ధర తగ్గిందోచ్.. ఇలా చేస్తే తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.. డోంట్ మిస్!

Samsung Galaxy S24 Ultra

Updated On : May 9, 2025 / 6:51 PM IST

Samsung Galaxy S24 Ultra : 2024 ప్రారంభంలో లాంచ్ అయిన అత్యంత పవర్‌ఫుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఇప్పుడు అమెజాన్ ఇండియాలో రూ. 84,999 ధరకు లభిస్తోంది.

Read Also : NASA Space Rock : నాసా హెచ్చరిక.. స్టేడియం సైజంత పెద్దది.. భారీ గ్రహశకలం దూసుకొస్తోంది.. మన గ్రహాన్ని ఢీకొట్టనుందా?

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర తగ్గింది. అలాగే, 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ కూడా తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • ఫ్లిప్‌కార్ట్‌లో అసలు ధర రూ. 1,19,999
  • అమెజాన్ ఆఫర్ ధర రూ. 84,999
  • ప్లాట్‌ఫామ్‌లో అదనపు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
  • ఫ్లాట్ రూ. 10వేలు తగ్గింపు (ఎంపిక చేసిన చెల్లింపు )
  • కొనుగోలుదారులు అర్హత కలిగిన బ్యాంక్ కార్డులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ఉపయోగించి ఆదా చేసుకోవచ్చు.
  • ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ప్రీమియం ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా టాప్-టైర్ స్పెసిఫికేషన్లతో వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.8-అంగుళాల క్వాడ్ HD+ అమోల్డ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
ప్రాసెసర్ : శాంసంగ్ ఎక్సినోస్ 2400 ద్వారా ఆధారితమైనది.
ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజీ : 12GB ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ
బ్యాటరీ : 45W ఫాస్ట్ ఛార్జింగ్ + రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ సపోర్టు
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OneUI 6పై రన్ అవుతుంది.
ఏఐ సపోర్టు : స్మార్ట్ పర్ఫార్మెన్స్ కోసం గెలాక్సీ ఏఐ
బెస్ట్ కెమెరా : ప్రో ఫోటోగ్రఫీ కోసం 200MP క్వాడ్ కెమెరా సెటప్
ఈ ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. భారీ 200MP ప్రైమరీ సెన్సార్ ఉంది.

  • 50MP టెలిఫోటో లెన్స్
  • 12MP అల్ట్రా-వైడ్ కెమెరా
  • 10MP పెరిస్కోప్ సెన్సార్
  • సెల్ఫీలు & వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా
  • ఫోటోగ్రఫీ ప్రియులు, నిపుణులు, కంటెంట్ క్రియేటర్లు S24 అల్ట్రా ఆప్షన్ ఎంచుకోవచ్చు.

Read Also : Motorola razr 60 Ultra : మోటోరోలా మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 13నే లాంచ్.. ఫోల్డబుల్ ఫోన్ కిర్రాక్ ఫీచర్లు.. గెట్ రెడీ!

ఈ రాత్రికే ఆఫర్ ముగుస్తుంది :
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఈరోజు రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది. మీరు ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం. ఇప్పటివరకు అత్యల్ప ధరకు గెలాక్సీ S24 అల్ట్రాను పొందవచ్చు.