NASA Space Rock : నాసా హెచ్చరిక.. స్టేడియం సైజంత పెద్దది.. భారీ గ్రహశకలం దూసుకొస్తోంది.. మన గ్రహాన్ని ఢీకొట్టనుందా?

NASA Space Rock : 950 అడుగుల భారీ గ్రహశకలం మే 9న భూమికి దగ్గరగా దూసుకువస్తోంది. ఈ భారీ అంతరిక్ష గ్రహశకలం భూమిని ఢీకొట్టనుందా?

NASA Space Rock : నాసా హెచ్చరిక.. స్టేడియం సైజంత పెద్దది.. భారీ గ్రహశకలం దూసుకొస్తోంది.. మన గ్రహాన్ని ఢీకొట్టనుందా?

NASA Space Rock

Updated On : May 9, 2025 / 2:42 PM IST

NASA Space Rock : 950 అడుగుల మరో అతిపెద్ద గ్రహశకలం దూసుకొస్తోంది. ఈ భారీ గ్రహశకలం దాదాపు ఒక స్టేడియం అంత పెద్దదిగా ఉంటుంది. మన గ్రహం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. మే 9న సాయంత్రం 4:32 గంటలకు అతి దగ్గరగా రానుంది.

Read Also : OnePlus vs Samsung : కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? వన్‌ప్లస్ 13s, శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ వచ్చేస్తున్నాయ్.. లాంచ్ డేట్, ధర, కీలక ఫీచర్లు ఇవేనా?

ఈ గ్రహశకలం 612356 (2002 JX8)అని పేరు పెట్టారు ఖగోళ సైంటిస్టులు. ఈ గ్రహశకలం 950 అడుగుల (290 మీటర్లు) వెడల్పు ఉంటుంది. ప్రమాదకరమైన గ్రహశకలం (PHA) గ్రూపు కింద వర్గీకరించారు.

సాధారణంగా ఈ ఖగోళ గ్రహశకలాలు ఎప్పుడైనా భూమిని ఢీకొంటే వినాశనం కలిగించేలా ఉంటాయి. 4.2 మిలియన్ కిలోమీటర్ల దూరంలో లేదా భూమి నుంచి చంద్రునికి దాదాపు 11 రెట్లు దూరంలో ప్రయాణించినప్పటికీ ఖగోళపరంగా దగ్గరగా ఉంటుందనే చెప్పాలి.

ఈ గ్రహశకలం ప్రమాదకరమైనది. దీని పరిమాణం మాత్రమే కాదు.. అపోలో-టైప్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ (NEO)గా వర్గీకరించారు. భూమి కక్ష్యతో కక్ష్యలు కలుస్తున్న గ్రహశకలాల తరగతి, భవిష్యత్తులో ఢీకొనే అవకాశాలు ఉన్నాయి.

అపోలో గ్రహశకలాలు అంటే ఏంటి? :
అపోలో ఆస్టరాయిడ్స్ అనేవి భూమికి దగ్గరగా ఉన్న అంతరిక్ష గ్రహశకలాల తరగతికి చెందినవి. వీటి కక్ష్యలు తరచుగా సూర్యుని చుట్టూ భూమి కక్ష్యను దాటుతాయి. ఈ ఖగోళ వస్తువుల్లో ఎక్కువ భాగం సురక్షితంగా దాటుతాయి.

అయితే, ఇతర ఖగోళ వస్తువులు ముఖ్యంగా 2002 JX8 వంటి ప్రమాదకరమైన గ్రహశకలాలు వాటి పరిమాణం, అనిశ్చిత దీర్ఘకాలిక కక్ష్యల కారణంగా సైంటిస్టులు నిశితంగా పరిశీలిస్తుంటారు.

ఆస్టరాయిడ్ 2002 JX8భూమిని ఢీకొట్టనుందా? :
2002 JX8-సైజు ఉల్క భూమిని ఢీకొంటే.. కలిగే ప్రమాదాలను అంచనా వేయడం కష్టం. అనేక విపత్కర పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉంది. 950 అడుగుల వెడల్పు, గంటకు దాదాపు 18,500 కిలోమీటర్ల వేగంతో కదులుతూ దూసుకువస్తాయి.

పదుల మెగాటన్ల TNTకి సమానమైన శక్తిని విడుదల చేస్తుంది. ఇప్పటివరకు అతిపెద్ద అణ్వాయుధాల కన్నా చాలా రెట్లు ఎక్కువ విధ్వంసం సృష్టిస్తుంది.

అదే నగరాలపై పడితే భారీ విస్ఫోటనానికి కారణమవుతుంది. సముద్రాన్ని తాకితే సునామీలను సృష్టిస్తుంది. వాతావరణంలోకి భారీగా ధూళిని చిమ్ముతుంది. మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది.

Read Also : Pakistan Hackers : బిగ్ అలర్ట్.. భారతీయ బ్యాంకులు, సోషల్ మీడియా యూజర్లే టార్గెట్.. పాకిస్తాన్ హ్యాకర్లతో ముప్పు..!

నాసా సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ (CNEOS) గ్లోబల్ టెలిస్కోప్‌ల నెట్‌వర్క్‌ల ద్వారా ఇలాంటి ముప్పులను నిరంతరం పర్యవేక్షిస్తుంది. అయినప్పటికీ, వేలాది NEO ఇంకా మ్యాప్ చేయలేదు. ఏయే గ్రహశకలాలు ఎప్పుడు భూమిపైకి దూసుకువస్తాయో గుర్తించడం కష్టమే.