OnePlus vs Samsung : కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? వన్‌ప్లస్ 13s, శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ వచ్చేస్తున్నాయ్.. లాంచ్ డేట్, ధర, కీలక ఫీచర్లు ఇవేనా?

OnePlus vs Samsung : వన్ ప్లస్, శాంసంగ్ అభిమానుల కోసం సరికొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఈ రెండు ప్రీమియం స్మార్ట్ ఫోన్ల లాంచ్ డేట్, ధర, కీలక ఫీచర్లు, స్పెషిఫికేషన్లు వివరాలు ఇలా ఉన్నాయి.

OnePlus vs Samsung : కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? వన్‌ప్లస్ 13s, శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ వచ్చేస్తున్నాయ్.. లాంచ్ డేట్, ధర, కీలక ఫీచర్లు ఇవేనా?

Updated On : May 9, 2025 / 1:24 PM IST

OnePlus vs Samsung : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ నెలలో స్మార్ట్‌ఫోన్ సీజన్ మొదలైంది. శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్, వన్‌ప్లస్ 13s రెండు పాపులర్ ఫ్లాగ్‌షిప్‌లు రానున్నాయి. శాంసంగ్ అత్యంత సన్నని ప్రీమియం ఫోన్‌ అందించనుంది.

వన్‌ప్లస్ ఇప్పటివరకు అత్యంత కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌ను రెడీ చేస్తోంది. రెండు హ్యాండ్‌సెట్‌లు ప్రీమియం స్పెక్స్, లేటెస్ట్ చిప్‌సెట్‌లు, అద్భుతమైన కెమెరా సిస్టమ్‌లను కలిగి ఉన్నాయి. లాంచ్ షెడ్యూల్, ధరలు, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

Read Also : Google Pixel 9 : పిక్సెల్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈ గూగుల్ పిక్సెల్ 9పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఐఫోన్ లెవల్ ఫీచర్లు.. డోంట్ మిస్!

శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ : లాంచ్, ధర, స్పెక్స్, కెమెరా, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్ మే 13న భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. శాంసంగ్ అధికారికంగా ధరను ప్రకటించనప్పటికీ, లీక్‌లు అమెరికా ధర 1,099 డాలర్ల నుంచి 1,199 డాలర్ల వరకు ఉండవచ్చని సూచిస్తున్నాయి. భారత మార్కెట్లో దాదాపు రూ.94వేల నుంచి రూ.1,02,600 వరకు ఉంటుంది.

స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ sAMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లోపల క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. 12GB ర్యామ్, 512GB గరిష్ట స్టోరేజీతో వస్తుంది. కెమెరా ఔత్సాహికులు 200MP ప్రైమరీ సెన్సార్‌ను పొందవచ్చు. 12MP/50MP అల్ట్రా-వైడ్ లెన్స్‌లు సపోర్టు ఇస్తాయి.

అయితే, సెల్ఫీలు 12MP ఫ్రంట్ కెమెరా ద్వారా వస్తాయి. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 3,900mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఫ్రంట్ సైడ్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ యూఐ 7 తో వస్తుంది.

వన్‌ప్లస్ 13s లాంచ్, ధర, స్పెసిఫికేషన్లు, కెమెరా, ఫీచర్లు :
చైనాలో ఇటీవల విడుదలైన వన్‌ప్లస్ 13T రీబ్రాండెడ్ వేరియంట్ వన్‌ప్లస్ 13s భారత్‌లో టీజ్ చేసింది. కానీ, ఇంకా విడుదల తేదీ రివీల్ చేయలేదు.

ఈ ఫోన్ ధర రూ. 45వేల నుంచి రూ. 50వేల మధ్య ఉంటుందని అంచనా. 6.32-అంగుళాల FHD+ ఎల్‌టీపీఓ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. పవర్ కెపాసిటీ కోసం 8T LTPO టెక్నాలజీని అందిస్తుంది.

Read Also : X Accounts Block : భారత్-పాక్ ఉద్రిక్తత.. భారత్‌లో 8 వేలకు పైగా ‘ఎక్స్’ అకౌంట్లు బ్లాక్.. ఫేక్ న్యూస్ కట్టడికి ఆదేశాలు..!

శాంసంగ్ కౌంటర్ మాదిరిగానే Snapdragon 8 ఎలైట్ చిప్ ద్వారా పవర్ పొందుతుంది. పెద్ద 16GB ర్యామ్, 512GB స్టోరేజీతో ఉంటుంది. కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

వీటితో పాటు 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. వన్‌ప్లస్ 13s 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 6,260mAh బ్యాటరీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆక్సిజన్ OS 15తో వస్తుంది.