Google Pixel 9 : పిక్సెల్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈ గూగుల్ పిక్సెల్ 9పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఐఫోన్ లెవల్ ఫీచర్లు.. డోంట్ మిస్!
Google Pixel 9 : పిక్సెల్ అభిమానుల కోసం గూగుల్ పిక్సెల్ 9 భారీ తగ్గింపుతో అందిస్తోంది. ఈ పిక్సెల్ ఫోన్ రూ.45వేల ధరకే కొనేసుకోవచ్చు.

Google Pixel 9
Google Pixel 9 : కొత్త పిక్సెల్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే మీకోసం అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్-లెవల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌ను (Google Pixel 9) సొంతం చేసుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్‌ను తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ (Google Pixel 9) వేరియంట్ రూ.79,999కు అందుబాటులో ఉంది. ఈ పిక్సెల్ ఫోన్ చాలా ఖరీదైనదిగా అనిపిస్తుందా? డోంట్ వర్రీ.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లతో SASA LELE సేల్‌ను నిర్వహిస్తోంది.
ఆసక్తిగల కొనుగోలుదారులు గూగుల్ పిక్సెల్ 9 డిస్కౌంట్ కొనుగోలుపై రూ.35వేలు ఆదా చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
గూగుల్ పిక్సెల్ 9పై డిస్కౌంట్ :
గత ఆగస్టులో భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5వేలు డిస్కౌంట్‌ను అందిస్తోంది.
ఆసక్తిగల కొనుగోలుదారులు SBI క్రెడిట్ కార్డ్‌తో రూ.8,500 డిస్కౌంట్‌ను కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు స్మార్ట్‌ఫోన్ ధరను రూ.66,499కి తగ్గిస్తాయి. ఈ ఆఫర్లతో పాటు ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్‌పై రూ.65,200 వరకు తగ్గింపును అందిస్తోంది.
గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకునే వారికి అదనంగా రూ.5వేలు లభిస్తుంది. ఉదాహరణకు.. మీరు గూగుల్ పిక్సెల్ 7ఎ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. రూ.21,500 తగ్గింపు పొందవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.44,999కి తగ్గుతుంది. అయితే, కచ్చితమైన విలువ అనేది మీ స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ 9 స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 9 (Google Pixel 9) పవర్‌ఫుల్ 6.3-అంగుళాల యాక్టువా OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2,700 నిట్‌ల వరకు ఆకట్టుకునే బ్రైట్‌నెస్ అందిస్తుంది. పవర్‌ఫుల్ టెన్సర్ G4 SoC ద్వారా రన్ అవుతుంది.
మల్టీ టాస్కింగ్ కోసం 12GB ర్యామ్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
ఇందులో 50MP వైడ్-యాంగిల్ లెన్స్, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. సెల్ఫీల కోసం 10.5MP ఫ్రంట్ కెమెరా ఉంది. 4,700mAh బ్యాటరీతో 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, Qi వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. మీ ఫోన్ రోజంతా ఛార్జింగ్ ఉంటుంది.