iOS 18.5 Update : ఐఓఎస్ 18.5 అప్‌డేట్ వచ్చేసిందోచ్.. కొత్త ఫీచర్లు, ఏయే ఐఫోన్లకు సపోర్టు చేస్తుంది? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?
iOS 18.5 Update : ఆపిల్ ఐఫోన్ ఐఓఎస 18.5 అప్‌డేట్ వచ్చేసిందోచ్.. కొత్త ఫీచర్లు, ఏయే ఐఫోన్ల డివైజ్‌లలో ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?

iOS 18 5 Update
iOS 18.5 Update : ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. వచ్చే జూన్‌లో జరిగే WWDC 2025లో ఆపిల్ iOS 19 రిలీజ్ చేయనుంది. కంపెనీ iOS 18.5 అప్‌డేట్‌ను ఇప్పటికే రిలీజ్ అయింది. ఐఫోన్ యూజర్ల కోసం కొత్త ఫీచర్లు అప్‌గ్రేడ్ తీసుకువస్తుంది.
ఈ అప్‌డేట్ మెయిల్ యాప్, పేరెంటల్ కంట్రోల్స్, ఆపిల్ టీవీ కొనుగోళ్లు, శాటిలైట్ కనెక్టివిటీకి కొన్ని మార్పులను తీసుకువస్తుంది. ప్రైడ్ థీమ్ వాల్‌పేపర్‌ను కూడా ప్రవేశపెట్టింది. కొత్త అప్‌డేట్స్ ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
1. మెయిల్ యాప్ నావిగేషన్ :
మెయిల్ యాప్ ఒక అప్‌డేట్ వస్తుంది. వినియోగదారులు గతంలో హైడ్ చేసిన ఆల్ మెయిల్ ఇన్‌బాక్స్‌ను వీక్షించవచ్చు. కేటగిరీ ఇన్‌బాక్స్‌లు, మెసేజ్ ఫుల్ లిస్ట్ మధ్య మారవచ్చు.
త్రి డాట్స్ మెను ఇప్పుడు ఇన్‌బాక్స్ వ్యూ నుంచి నేరుగా కాంటాక్ట్ ఫొటోలను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసేందుకు అనుమతిస్తుంది. సెట్టింగ్‌లకు వెళ్లకుండానే కస్టమైజ్ చేసుకోవచ్చు.
2. ఐఫోన్ కోసం కొత్త ప్రైడ్ వాల్‌పేపర్ :
ఐఫోన్‌ల కోసం కొత్త ప్రైడ్-బ్యాక్‌గ్రౌండ్ వాల్‌పేపర్‌ను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. అన్ని సైజులకు ప్రైడ్ ఎడిషన్ వాచ్ బ్యాండ్‌ను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. ఐఫోన్ ధర రూ. 4,500కు పొందవచ్చు. రిటైల్ పార్టనర్లు, అధికారిక స్టోర్లు, ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
3. స్క్రీన్ సమయంలో పేరెంట్స్ కంట్రోలింగ్ :
ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల స్క్రీన్ టైమ్ పాస్‌కోడ్‌తో డివైజ్‌లో నోటిఫికేషన్‌లను పొందొచ్చు. ఈ కొత్త ఫీచర్‌తో మానిటరింగ్ కోసం వినియోగ పరిమితులకు అనధికార మార్పులను నిరోధించాలని ఆపిల్ సూచిస్తోంది.
4. థర్డ్-పార్టీ టీవీల కోసం ఆపిల్ టీవీ యాప్ :
గతంలో tvOS రన్ అయ్యే ఆపిల్ TV డివైజ్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆపిల్ ఇప్పుడు ఐఫోన్‌తో కొనుగోలు చేసే సౌలభ్యాన్ని విస్తరిస్తోంది.
iOS 18.5తో, వినియోగదారులు ఇప్పుడు ఆపిల్ టీవీ యాప్‌ను థర్డ్ పార్టీ స్మార్ట్ టీవీలు, స్ట్రీమింగ్ డివైజ్‌ల్లో ఉపయోగించవచ్చు. ఐఫోన్ నుంచి నేరుగా కొనుగోళ్లను అథెంటికేషన్ పొందవచ్చు.
5. ఐఫోన్ 13 సిరీస్ శాటిలైట్ కనెక్టివిటీ :
ఐఫోన్ 14 కొత్త మోడళ్లకు మాత్రమే శాటిలైట్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. ఇప్పుడు iOS 18.5తో ఐఫోన్ 13 సిరీస్‌కు అందుబాటులో ఉంది.
సరిగా నెట్‌వర్క్‌లు లేని ప్రదేశాలలో కమ్యూనికేషన్ (T-Mobile) స్టార్‌లింక్-ఆధారిత కనెక్టివిటీ అమెరికాలో క్యారియర్ శాటిలైట్ సర్వీసులను యాక్సెస్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.
iOS 18.5 సపోర్టు చేసే ఫోన్లు ఇవే :
iOS 18కి సపోర్టు ఇచ్చే ఏ ఐఫోన్ మోడల్ అయినా iOS 18.5 అమలు చేయగలదు. ఈ జాబితాలో iPhone XS/XS Max, iPhone XR, iPhone SE (2వ జనరేషన్ ఆపై వెర్షన్), ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ 15 సిరీస్, ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 11 సిరీస్ ఉన్నాయి.
iOS 18.5 అప్‌డేట్ డౌన్‌లోడ్ ఎలా? :
వినియోగదారులు iOS 18.5 అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Settings> General > Software Update వినియోగదారులు తమ ఐఫోన్ Wi-Fiకి కనెక్ట్ చేయాలి. తగినంత బ్యాటరీ ఛార్జింగ్ ఉండాలి.