Apple iPhone 16 Plus : ఆఫర్ అదిరింది భయ్యా.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్లస్.. మీ బడ్జెట్ ధరలో ఇలా కొనేసుకోండి!
Apple iPhone 16 Plus : కొత్త ఐఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్ మోడల్ పై ఏకంగా రూ. 14,500 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

iPhone 16 Plus
Apple iPhone 16 Plus : ఆపిల్ కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఈ ఐఫోన్ డీల్ అసలు వదులుకోవద్దు. మీరు ఐఫోన్ 16 ప్లస్ (Apple iPhone 16 Plus) కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం.
ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్ పై భారీ తగ్గింపును అందిస్తోంది. గతంలో కన్నా సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు. రూ. 14,500 కన్నా ఎక్కువ సేవింగ్స్ పొందవచ్చు.
ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవని గమనించాలి. మీరు ఐఫోన్ 16 ప్లస్ కొనాలని భావిస్తే ఇప్పుడే కొనడం బెటర్. ఈ డీల్ ఎలా పొందాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16 ప్లస్ డీల్ :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్లస్ రూ.89,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో, ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రూ.78,999కి జాబితా అయింది. అంటే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఐఫోన్ 16 ప్లస్‌పై ఫ్లాట్ రూ.10,901 తగ్గింపును అందిస్తోంది.
అలాగే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై అదనంగా రూ.4వేలు తగ్గింపును పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయవచ్చు.
ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఐఫోన్ 16 ప్లస్ 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద, ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఆపిల్ A18 చిప్‌సెట్‌తో అమర్చి ఉంటుంది. అలాగే, ఐఫోన్ అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్లస్‌లో 48MP మెయిన్ కెమెరా ఉంది. అంతేకాదు.. 12MP అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, ఫోన్‌లో 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.
ఆపిల్ ప్రకారం.. ఐఫోన్ 16 ప్లస్ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఇంకా, ఈ ఐఫోన్ IP68-సర్టిఫైడ్, అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది.