Best Inverter ACs : కొత్త AC కొంటున్నారా? ఈ సమ్మర్‌లో 5 పవర్ సేవింగ్ బెస్ట్ ఇన్వర్టర్ ఏసీలు ఇవే.. మీకు నచ్చిన ఏసీ కొనేసుకోండి!
Best Inverter ACs : కొత్త ఏసీ కొంటున్నారా? సమ్మర్ సీజన్‌లో 5 పవర్ సేవింగ్ బెస్ట్ ఇన్వర్టర్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏసీ ఏది కొంటారో మీ ఇష్టం..

Best Inverter ACs
Best Inverter ACs : అసలే ఎండలు మండిపోతున్నాయి. ఏసీలు, కూలర్ లేకుండా ఇంట్లో కాసేపు కూడా ఉండలేరు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 48 నుంచి 50 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు చేరుకోనున్నాయి.
వేసవి కాలంలో ఎయిర్ కండిషనర్ తప్పక ఉండాల్సిందే. ఇటీవలి కాలంలో విద్యుత్ యూనిట్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఎయిర్ కండిషనర్‌ను కొనుగోలు చేసే సమయంలో మెయింట్‌నెన్స్ గురించి తప్పక అవగాహన ఉండాలి.
మంచి ఎయిర్ కండిషనర్ కొనుగోలు చేయడం ద్వారా పవర్ సేవింగ్ చేసుకోవచ్చు. మీరు ఏసీని కొనే ముందు హై స్టార్ రేటింగ్, ఇన్వర్టర్ టెక్నాలజీ, లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్ కోసం స్మార్ట్ ఫిల్టర్లు కాపర్ కండెన్సర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగిన ఏసీ మోడళ్లు ఎంచుకోవాలి.
ఈ సమ్మర్‌లో కూడా 80వేల లోపు ధరలో టాప్ 5 ఎనర్జీ సేవింగ్ ఏసీలు మీకోసం అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన బెస్ట్ ఇన్వర్టర్ ఏసీని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవచ్చు.
ఎలిస్టా EL-SAC18-5INVBP5 స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ : ధర రూ. 57,000
ఎలిస్టా EL-SAC18-5INVBP5 స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ సౌకర్యం, ఖర్చు సామర్థ్యం రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. ఫీచర్-లోడెడ్, హై పర్ఫార్మెన్స్ కూలింగ్ అందిస్తుంది. ఈ 1.5-టన్నుల, 5-స్టార్ రేటెడ్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ పవర్ సేవింగ్ కాకుండా పవర్‌ఫుల్ కూలింగ్ అందిస్తుంది. 4-ఇన్-1 కన్వర్టిబుల్ ఫంక్షనాలిటీతో వస్తుంది.
5-స్టార్ రేటెడ్ ఏసీ బ్లూఫిన్ టెక్నాలజీ ద్వారా సపోర్టు ఇస్తుంది. 100 శాతం కాపర్ కండెన్సర్‌ను కలిగి ఉంది. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ వేగవంతమైన కూలింగ్, తుప్పు నిరోధకతతో పాటు ఎక్కువ లైఫ్ టైమ్ అందిస్తుంది.
ఎలిస్టా ఎయిర్ కండిషనర్‌లో 3-ఇన్-1 యాంటీ-వైరస్ HD ఫిల్టర్‌ను కూడా అమర్చారు. ఎలిస్టా హెల్త్‌మ్యాక్స్ టెక్నాలజీ కలిగి ఉంది. దుమ్ము, విష వ్యర్థాలను తొలగించడం ద్వారా క్లీన్ ఎయిర్ అందిస్తుంది. ఇంట్లో ఈ AC రిఫ్రెష్, శానిటరీ కూలింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ : ధర రూ. 66,200
డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీ కూడా కూలింగ్ కెపాసిటీని కలిగి ఉంది. ఎయిర్ కండిషనర్ నియో-స్వింగ్ ఇన్వర్టర్ కంప్రెసర్‌ను కలిగి ఉంది. ఈ ఏసీ 5-స్టార్ పవర్ సామర్థ్యం, 5.2 ISEER రేటింగ్‌ను కలిగి ఉంది. డైకిన్ పేటెంట్ ఎకోనో మోడ్, పవర్ చిల్ ఆపరేషన్‌తో కూడా అమర్చారు.
పవర్ గ్రిడ్‌ను ప్రెజర్ పడకుండా స్పీడ్ కూలింగ్ అందిస్తుంది. ఈ మోడల్ 100 శాతం కాపర్ కండెన్సర్‌ను కలిగి ఉంది. గది అంతటా సమానమైన కూలింగ్ అందించే కోండా ఎయిర్‌ఫ్లో సిస్టమ్‌ను కలిగి ఉంది. స్టెబిలైజర్-ఫ్రీ మోడ్, లో రిఫ్రిజెరాంట్ డిటెక్షన్ ఫీచర్‌తో ఈ ఏసీ చాలా మంచి కూలింగ్ అందిస్తుంది.
LG 1.5 టన్ 5 స్టార్ ఏఐ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ధర రూ. 73,990 :
ఎల్‌జీ ఇన్వర్టర్ ఏసీలలో 1.5 టన్ 5 స్టార్ ఏఐ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ కూడా ఉంది. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ కూలింగ్ అందిస్తుంది.
ఈ ఏసీ ఏఐ కన్వర్టిబుల్ 6-ఇన్-1 కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. గది ఉష్ణోగ్రతల ప్రకారం టన్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఏసీ ఎల్‌జీ డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్‌ను కలిగి ఉంది. పవర్ సేవ్ చేస్తుంది.
సౌండ్ కూడా పెద్దగా ఉండదు. 5.2 ISEER రేటింగ్, ఏడాదికి 685 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తుంది. అదనంగా, ఈ యూనిట్ యాంటీ-వైరస్ ప్రొటెక్షన్‌తో కూడిన HD ఫిల్టర్, తుప్పును తట్టుకునేలా ఇండోర్, అవుట్‌డోర్ యూనిట్లపై ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్, స్మార్ట్ డయాగ్నసిస్‌ను కలిగి ఉంది. 10 ఏళ్ల కంప్రెసర్ వారంటీ కూడా కలిగి ఉంది.
వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ : ధర రూ. 79,990
వోల్టాస్ 1.5 టన్ 5-స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ఉష్ణోగ్రత ఆధారంగా కూలింగ్ అడ్జెస్ట్ చేస్తుంద. వేరియబుల్-స్పీడ్ ఇన్వర్టర్ కంప్రెసర్‌ను కలిగి ఉంది.
వోల్టాస్ ప్రకారం.. ఈ ఏసీ మిడ్ రేంజ్ సైజు గదులకు (111–150 చదరపు అడుగులు) అనువైనది. 5-స్టార్ ఎనర్జీ రేటింగ్, 5 ISEER వాల్యూ భారతీయ యూజర్లకు బెస్ట్ మోడల్‌గా చెప్పవచ్చు. ఏడాదికి 751.28kWh మాత్రమే ఈ ఏసీ పవర్ సేవ్ చేస్తుంది. 100 శాతం కాపర్ కండెన్సర్ కూలింగ్ పర్ఫార్మెన్స్ పెంచుతుంది. ఏసీ కంప్రెసర్‌పై 10 ఏళ్ల వారంటీ, PCBపై 5 ఏళ్ల వారంటీతో వస్తుంది.
బ్లూ స్టార్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ : ధర రూ. 79,990
బ్లూ స్టార్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీ లోడ్-ఆధారిత కూలింగ్ కోసం ఇన్వర్టర్ రోటరీ కంప్రెసర్‌తో వస్తుంది. ఈ ఏసీ బయటి ఉష్ణోగ్రత 52 డిగ్రీల సెల్సియస్ ఉన్నా కూడా కూలింగ్ అందిస్తుంది. ఈ వేరియంట్ ఏడాదికి సుమారు 755kWh మాత్రమే ఉపయోగిస్తుంది.
5.1 ISEER రేటింగ్‌ను కలిగి ఉంది. 0.5°C ఇంక్రిమెంట్లలో ప్రెసిషన్ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. యాంటీ-కొరోసివ్ బ్లూ ఫిన్ కోటింగ్‌ను కలిగి ఉంది. కంప్రెసర్‌పై ఉన్న బ్రష్‌లెస్ DC మోటార్, అకౌస్టిక్ జాకెట్ విస్పర్-క్వైట్ ఆపరేషన్‌ను అందిస్తాయి. సెల్ఫ్ డిటెక్షన్ సిస్టమ్, పవర్ సేవింగ్స్ కోసం ఎకో-మోడ్‌ను కూడా కలిగి ఉంది.