Samsung Galaxy S25 Edge : శాంసంగ్ లవర్స్ కోసం కొత్త గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్.. మే 13నే లాంచ్.. ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఇవేనా?
Samsung Galaxy S25 Edge : శాంసంగ్ అభిమానులకు అదిరే న్యూస్.. భారత మార్కెట్లోకి మే 13న శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్ వచ్చేస్తోంది.

Samsung Galaxy S25 Edge
Samsung Galaxy S25 Edge : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ (Samsung Galaxy S25 Edge) వచ్చేస్తోంది. పుకార్ల తర్వాత మే 13న శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ రాకను ప్రకటించింది.
ఈ సంవత్సరం ప్రారంభంలో గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో మొదటిసారి కనిపించనుంది. ఈ హ్యాండ్‌సెట్ వచ్చే వారం లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ కొత్త అల్ట్రా-స్లిమ్ వేరియంట్ గ్లోబల్ మార్కెట్‌లో గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 అల్ట్రా లిస్టు లలో చేరనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏఐ, 200MP ప్రైమరీ కెమెరాతో ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ లెవల్ పర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ ధృవీకరించింది. గెలాక్సీ S25 ఎడ్జ్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, ధర, ఇతర వివరాల గురించి ఇప్పటివరకు రివీల్ చేయలేదు.
శాంసంగ్ గెలాక్సీ S25ఎడ్జ్ డిజైన్ (అంచనా) :
శాంసంగ్ ఇప్పటికే రాబోయే అల్ట్రా-స్లిమ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌ను రివీల్ చేసింది. డిజైన్‌ను ఈ స్మార్ట్‌ఫోన్ LED ఫ్లాష్‌తో పాటు పిల్-ఆకారపు వర్టికల్ కెమెరా మాడ్యూల్‌తో తీసుకొస్తోంది. ఫ్రంట్ సైడ్ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్‌ను కలిగి ఉంది.
కంపెనీ ఫోన్ సైజు ఎంతో వెల్లడించలేదు. కానీ, పుకార్ల ప్రకారం.. 6.23×2.97×0.23 అంగుళాలు (158.2 x 75.5 x 5.84 మిమీ) ఉంటుందని సూచిస్తున్నాయి. ఈ ఫోన్ డస్ట్, నీటి నిరోధకతకు IP68 రేటింగ్‌ను కూడా కలిగి ఉంటుందని అంచనా.
శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల OLED ప్యానెల్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా ఉండవచ్చు.
ఈ ఫోన్ 12GB ర్యామ్, 512GB స్టోరేజీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ 15-ఆధారిత OneUI 7లో రన్ కావచ్చు. ఈ కొత్త గెలాక్సీ ఏఐ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్ 2x ఇన్-సెన్సార్ జూమ్, OISతో 200MP ప్రైమరీ షూటర్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండవచ్చు. అదనంగా, 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 3,900mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.
భారత్, యూఎస్ఏలో శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ధర (అంచనా) :
అమెరికాలో శాంసంగ్ గెలాక్సీ S25ఎడ్జ్ ధర 1,099 డాలర్లు, 1,199 డాలర్ల మధ్య ఉండొచ్చు. భారత మార్కెట్లో ఈ శాంసంగ్ ఫోన్ ధర దాదాపు రూ.94,800 నుంచి రూ.1,03,400 వరకు ఉంటుందని అంచనా.