Samsung Galaxy S25 : పండగ చేస్కోండి.. ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ శాంసంగ్ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Samsung Galaxy S25 : శాంసంగ్ గెలాక్సీ S25 ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధర తగ్గింది.. ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనుగోలుపై ఏకంగా రూ. 15వేలు సేవ్ చేసుకోవచ్చు.

Samsung Galaxy S25 : పండగ చేస్కోండి.. ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ శాంసంగ్ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Samsung Galaxy S25 Price

Updated On : May 8, 2025 / 5:02 PM IST

Samsung Galaxy S25 : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఫీచర్లు, పర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కొనేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S25  కొనేందుకు ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

ప్రస్తుతం, మీరు శాంసంగ్ స్టోర్‌లో ఈ ఫోన్ రూ.60వేల లోపు ధరకు పొందవచ్చు. ఈ ఫోన్ బేస్ 12GB + 128GB కాన్ఫిగరేషన్ రూ.74,999 ప్రారంభ ధరకు వస్తుంది. అయితే, శాంసంగ్ డైరెక్ట్ డిస్కౌంట్ కాదు.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 20వ విడత రాకముందే కొత్త మార్పు.. రూ.2వేలు పడాలంటే ఇలా చేయాల్సిందే..!

బ్యాంక్ ఆఫర్లు, శాంసంగ్ షాప్ యాప్ ఆఫర్ ద్వారా మాత్రమే లభిస్తుంది. ఈ కొత్త శాంసంగ్ గెలాక్సీ S25 తక్కువ ధరకు ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

శాంసంగ్ స్టోర్‌లో (Samsung Galaxy S25) డీల్ :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల పూర్తి చెల్లింపుపై రూ. 10వేలు బ్యాంక్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఈఎంఐ ఎంచుకునే కొనుగోలుదారులు రూ. 8వేలు ఆదా చేసుకోవచ్చు. కొనుగోలుదారులు మొదటి కొనుగోలుపై శాంసంగ్ షాప్ యాప్ ద్వారా అదనంగా రూ. 4వేలు తగ్గింపు కూడా పొందవచ్చు.

అంతేకాకుండా, మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. అదే స్టోర్ రూ. 45వేల వరకు ట్రేడ్-ఇన్ విలువతో పాటు రూ. 11వేలు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. అంతేకాదు శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. అన్ని ఇతర ఆఫర్‌లతో కలిపి కూడా వినియోగించుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S25 (Samsung Galaxy S25)  స్పెసిఫికేషన్లు :
ఈ ఏడాది ప్రారంభంలో శాంసంగ్ గెలాక్సీ S25, శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాతో పాటు లాంచ్ అయింది. ఈ ఫోన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల FHD+ అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో క్వాల్‌కామ్ స్నాప్‌‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.

Read Also : Starlink Internet : భారత్‌కు ఇక స్టార్‌లింక్ వచ్చేస్తుందోచ్.. సరసమైన ధరకే శాటిలైట్ హైస్పీడ్ ఇంటర్నెట్.. రేట్లు ఎంత ఉండొచ్చంటే?

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 50MP బ్యాక్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది.

అదనంగా, శాంసంగ్ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత వన్ యూఐ 7 స్కిన్‌పై రన్ అవుతుంది.