Moto G86 5G Launch : ఓ కన్నేసి ఉంచండి.. మోటో G86 5G ఫోన్ వస్తోంది.. ఇండియాకు ఎప్పుడైనా రావొచ్చు.. ఫీచర్లు, ధరపై అంచనాలివే..!
Moto G86 5G Launch : మోటో కొత్త 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. రాబోయే ఫోన్ ధర, ఫీచర్లు వివరాలపై అంచనాలు నెలకొన్నాయి.

Moto G86 5G Launch
Moto G86 5G Launch : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్.. మరో కొత్త మోటోరోలా 5జీ ఫోన్ వచ్చేస్తోంది. ఇప్పటికే మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో లాంచ్ కాగా, లెనోవా సబ్-బ్రాండ్ మోటో G86 ఫోన్ (Moto G86 5G Launch) లాంచ్ చేయనుంది.
ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ 5G ఫోన్ రిలీజ్ చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. మోటో G85 అప్‌గ్రేడ్ ఫోన్ పర్ఫార్మెన్స్, డిస్ప్లే, కెమెరాతో సహా కొన్ని అప్‌గ్రేడ్స్ ఉంటాయని భావిస్తున్నారు.
ఇటీవలి లీక్‌ల ప్రకారం.. కంపెనీ భారీ బ్యాటరీ, 10-బిట్ కర్వ్డ్ pOLED డిస్‌ప్లే, స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్‌ను కూడా అందించవచ్చు.
మోటో G86 గురించి కీలక వివరాలు రివీల్ చేయలేదు. మోటోరోలా G85 అప్‌గ్రేడ్ లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్లు, ధర పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మోటో G86 5G స్పెసిఫికేషన్లు (అంచనా) :
టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ ప్రకారం.. మోటో G86 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 1.5K కర్వ్డ్ pOLED ప్యానెల్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ మోటో ఫోన్ 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందవచ్చు.
హుడ్ కింద, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC ద్వారా పవర్ పొందవచ్చు. 12GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్‌తో ఆండ్రాయిడ్ 15లో రన్ కావచ్చు. రెండు ఏళ్ల OS అప్‌డేట్‌లతో వస్తుందని భావిస్తున్నారు.
మోటో G86 5G ఫోన్ 5,200mAh సెల్ లేదా 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,720mAh బ్యాటరీతో వస్తుందని చెబుతున్నారు. కనెక్టివిటీ విషయానికొస్తే.. ఈ ఫోన్ 5G, 4G VoLTE, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, GLONASS, Beidou, NFC, టైప్-C పోర్ట్‌తో రావచ్చు.
IP68 రేటింగ్‌తో పాటు మిలిటరీ గ్రేడ్ MIL-STD 810H సర్టిఫికేషన్‌ను కూడా పొందవచ్చు. కెమెరా విషయానికొస్తే.. ఈ మోటో ఫోన్ 8MP అల్ట్రావైడ్ సెన్సార్ OISతో 50MP సోనీ LYT-600 ప్రైమరీ షూటర్‌ను అందిస్తుందని చెబుతున్నారు. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ 32MP సెల్ఫీ కెమెరాను పొందవచ్చు.
మోటో G86 5G ధర అంచనాలు :
మోటో G86 5G బేస్ వేరియంట్ ధర దాదాపు EUR 330 (దాదాపు రూ. 31,200) ఉంటుందని అంచనా. అయితే, భారత మార్కెట్లో తక్కువ ధరకే ఈ మోటో G86 ఫోన్ ప్రవేశపెట్టవచ్చు. ఈ మోటో ఫోన్ గోల్డెన్, కాస్మిక్ (లైట్ పర్పుల్), రెడ్, స్పెల్‌బౌండ్ (బ్లూ) కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రావచ్చు.