Motorola Edge 60 Pro : బిగ్ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5G కొనేసుకోండి.. ఇది కదా ఆఫర్ అంటే..!
Motorola Edge 60 Pro : మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ధర ఎంత తగ్గిందంటే?

Motorola Edge 60 Pro
Motorola Edge 60 Pro : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 30న మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5G లాంచ్ చేసింది. లాంచ్ అయిన వారంలోనే ఈ 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో ఫస్ట్ సేల్ మొదలైంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ SoC, క్వాడ్ కర్వ్డ్ POLED స్క్రీన్, 50MP ప్రైమరీ సెన్సార్ వంటి ఫీచర్లను అందిస్తుంది.
ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై వివిధ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. మరిన్ని పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో, ఆఫర్లు :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ రెండు వేర్వేరు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ రూ.29,999కు, 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ హై వేరియంట్ రూ.33,999కు లభిస్తుంది.
ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను పాంటోన్ డాజ్లింగ్ బ్లూ, పాంటోన్ స్పార్క్లింగ్ గ్రేప్, పాంటోన్ షాడో కలర్ ఆప్షన్లలో పొందవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.
ఆఫర్ల విషయానికొస్తే.. మోటోరోలా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ప్లాన్‌లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.
అదనంగా, వినియోగదారులు కేవలం రూ.5,667 నుంచి నో-కాస్ట్ EMI బెనిఫిట్స్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ల విషయానికొస్తే.. గరిష్టంగా రూ.29వేల వరకు పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ SoC ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు LPDDR4X ర్యామ్, 512GB వరకు UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది.
హలో యూఐ ఓవర్‌లేతో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. నాలుగు ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు 3 ఏళ్ల మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందుకునేందుకు రెడీగా ఉంది.
అద్భుతమైన 6.7-అంగుళాల 1.5K (1,220×2,712 పిక్సెల్స్) క్వాడ్ కర్వ్డ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 446ppi పిక్సెల్ డెన్సిటీ, 4,500 నిట్‌ల ఆకట్టుకునే గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తాయి. ఫోటోగ్రఫీ పరంగా, ఎడ్జ్ 60 ప్రో 50MP ప్రైమరీ సోనీ లైటియా 700C సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 10MP టెలిఫోటో కెమెరాతో సహా మల్టీఫేస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
సెల్ఫీల కోసం, 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఈ మోటోరోలా ఫోన్ డస్ట్, నీటి నిరోధకతకు IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది. అలాగే మిలిటరీ-గ్రేడ్ (MIL-STD-810H)వెరిఫికేషన్ కలిగి ఉంది.
డాల్బీ అట్మోస్ సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. అదనపు ఫేస్ అన్‌లాక్‌తో పాటు సేఫ్ అథెంటికేషన్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇవన్నీ పవర్‌ఫుల్ 6,000mAh బ్యాటరీ, 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.