8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. భారీగా పెరగనున్న ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు.. ఎంత ఉండొచ్చంటే
8th Pay Commission : 8వ వేతన సంఘం కీలక అప్‌డేట్.. కొత్త వేతన సంఘం ప్రకారం.. కనీస వేతనం రూ. 20వేల నుంచి రూ. 57,200 వరకు పెరిగే అవకాశం ఉంది.

8th Pay Commission
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘానికి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. కోట్లాది మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఉపశమనం కలగనుంది.
కొత్త వేతన కమిషన్ ప్రకారం.. ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86కి పెరగవచ్చనే చర్చ జరుగుతోంది.
ఇదే జరిగితే.. ఒక ఉద్యోగి ప్రస్తుత కనీస వేతనం రూ.20వేల నుంచి రూ.57,200కి పెరగవచ్చు. అంటే.. రూ.37వేల కన్నా ఎక్కువ ప్రత్యక్ష ప్రయోజనాలను పొందవచ్చు.
ఇప్పటికే, 8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. వాస్తవానికి, ప్రస్తుత వేతన సంఘం గడువు డిసెంబర్ 2025లో ముగుస్తుంది. కానీ, ప్రభుత్వం అంతకు ముందే కొత్త కమిషన్ నియామకం వైపు దిశగా అడుగులు వేస్తోంది.
కొత్త కమిషన్‌లో చైర్మన్‌తో సహా 42 పోస్టులకు త్వరలో నియామకాలు జరగనున్నాయని తెలుస్తోంది. ఈ కొత్త వేతన కమిషన్ ఏర్పాటుపై అధికారిక ప్రక్రియ వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంచనా :
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల కొత్త కనీస వేతనంపై నిర్ణయించే ఒక ఫార్ములా. సరళంగా చెప్పాలంటే.. కొత్త ప్రాథమిక జీతం = పాత ప్రాథమిక జీతం × ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనమాట. 7వ వేతన కమిషన్‌లో ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 అంటే.. మీ బేసిక్ శాలరీ రూ. 10వేలు అయితే, కొత్త కమిషన్ ప్రకారం.. రూ. 25,700 అయింది.
ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఈ అంశం 2.86కి పెరగవచ్చనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే.. ప్రస్తుత ఉద్యోగి కనీస వేతనం రూ.20వేలు నుంచి రూ.57,200కి పెరగవచ్చు. అంటే.. రూ.37వేల కన్నా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.
జీతం ఎంత పెరుగుతుందంటే? :
ఈ మార్పుతో ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో మార్పుతో వివిధ కనీస వేతనాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కొన్ని అంచనా గణాంకాలు ఉన్నాయి. ఉదాహరణకు.. మీ పాత జీతం రూ. 30వేలు అయితే, 7వ వేతన కమిషన్‌లో రూ. 77,100 అయింది.
కానీ, 8వ వేతన కమిషన్‌లో అదే జీతం రూ. 85,800 వరకు ఉండవచ్చు. అలాగే, కొన్ని ఉద్యోగి సంస్థలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.68కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. దీని కారణంగా పాత జీతం రూ. 30వేల నుంచి రూ. 1,10,400కి పెరిగే అవకాశం ఉంది.