SIP Calculator : మీకు ఈ నెల జీతం పడిందా? ప్రతి నెలా SIPలో రూ.5వేలు పెట్టుబడితో ఎన్ని ఏళ్లలో రూ.1 కోటి సంపాదించవచ్చంటే

SIP Calculator : మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? మీ డబ్బును SIP ద్వారా ఇలా పెట్టుబడి పెట్టండి. కొన్ని ఏళ్లలో రూ. కోటి సంపాదించుకోవచ్చు.

SIP Calculator : మీకు ఈ నెల జీతం పడిందా? ప్రతి నెలా SIPలో రూ.5వేలు పెట్టుబడితో ఎన్ని ఏళ్లలో రూ.1 కోటి సంపాదించవచ్చంటే

SIP Calculator

Updated On : May 7, 2025 / 5:38 PM IST

SIP Calculator : మీకు ఈ నెల జీతం పడిందా? అయితే, ఆ జీతం డబ్బులను ఏదైనా పెట్టుబడుల వైపు మళ్లించండి. ప్రతి వ్యక్తి తన నెలవారీ ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేయాలని భావిస్తుంటారు.

ఒక మంచి పథకంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. భవిష్యత్తు కోసం ఇప్పటినుంచే పెట్టుబడి పెట్టడం ద్వారా సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీరు మంచి లాభాలను కూడా పొందవచ్చు.

Read Also : War Emergency Alerts : ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వార్ ఎమర్జెన్సీ అలర్ట్స్ ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసా? ఇదిగో ఫుల్ గైడ్ మీకోసం..!

పెట్టుబడి పెట్టడానికి అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది పోస్టాఫీస్ పథకాలలో పెట్టుబడి పెడతారు. బ్యాంక్ FDలో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడతారు.

కానీ, మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి అనేది బాగా పాపులర్ అయింది. ఇంతకీ ఈ SIPలో పెట్టుబడి ఎలా పెట్టాలి? ఎన్ని ఏళ్లు పెట్టుబడి పెడితే రూ. కోటి సంపాదించుకోవచ్చు.

SIPలో ఎలా పెట్టుబడి పెట్టాలి? :
ఈ రోజుల్లో చాలా మంది తమ డబ్బును మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మీరు మీ డబ్బును SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు.

మ్యూచువల్ ఫండ్ SIPలో క్రమం తప్పకుండా ఎక్కువ సంవత్సరాలు పెట్టుబడి పెడితే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు.

మ్యూచువల్ ఫండ్ SIPలో ఎక్కువ కాలం పెట్టుబడితో గరిష్టంగా 12 శాతం రాబడిని పొందవచ్చు. మార్కెట్ లింక్డ్ స్కీమ్ కారణంగా అందుకున్న రాబడి మార్కెట్‌ను బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయని గమనించాలి.

రూ. 5వేల SIP ద్వారా రూ. 1 కోటి సంపాదన ఎలా? :
మీరు మ్యూచువల్ ఫండ్ SIPలో లాంగ్ టైమ్ క్రమం తప్పకుండా ప్రతి నెలా రూ. 5వేలు పెట్టుబడి పెడితే.. మీరు రూ. 1 కోటి వరకు డబ్బులను సంపాదించొచ్చు.

Read Also : Oppo F27 Pro Plus 5G : ఒప్పో 5G ఫోన్ అదుర్స్.. అమెజాన్‌లో రూ. 21వేలు మాత్రమే.. ఇంత తక్కువకు మళ్లీ జన్మలో రాదు!

ఇందుకోసం మీరు 27 ఏళ్ల పాటు నిరంతరం ప్రతి నెలా రూ. 5వేలు పెట్టుబడి పెట్టాలి. వరుసగా 27 ఏళ్లు ప్రతి నెలా రూ. 5వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా మొత్తం రూ. 16,20,000 పెట్టుబడి పెడతారు. మొత్తంగా రూ. 91,91,565 రాబడి వస్తుంది. మీకు 27 ఏళ్ల తర్వాత 12 శాతం రేటుతో మొత్తం రూ. 1,08,11,565 లభిస్తుంది.