War Emergency Alerts : ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వార్ ఎమర్జెన్సీ అలర్ట్స్ ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసా? ఇదిగో ఫుల్ గైడ్ మీకోసం..!

War Emergency Alerts : మొబైల్ ఆపరేటర్ల ద్వారా ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అలర్ట్స్ పంపుతుంది. మీ ఫోన్ ఈ అలర్ట్స్ అందుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

War Emergency Alerts : ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వార్ ఎమర్జెన్సీ అలర్ట్స్ ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసా? ఇదిగో ఫుల్ గైడ్ మీకోసం..!

War Emergency Alerts

Updated On : May 7, 2025 / 2:54 PM IST

War Emergency Alerts : పాక్ ఉగ్రదాడికి దీటుగా భారత్ బదులిస్తోంది. వైమానిక దాడులతో పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తోంది. పాక్, భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నివసించే భారతీయ పౌరులను అప్రమత్తం చేస్తోంది.

Read Also : iPhone 16 Pro Max : భలే డిస్కౌంట్ బాస్.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఇంత తక్కువా.. బ్యాంకు ఆఫర్లతో ఇంకా తగ్గింపు ధరకే..!

ఇందులో భాగంగా భారత ప్రభుత్వం, టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT), జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) ద్వారా ఈరోజు (మే 7, 2025) మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది.

ప్రకృతి వైపరీత్యాలు లేదా ఉగ్రదాడులు వంటి సంక్షోభ సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వైమానిక దాడి సైరన్‌లు, రియల్-టైమ్ మొబైల్ అలర్ట్స్ సహా భారత అత్యవసర ప్రసార వ్యవస్థలను ఎవాల్యూట్ చేయడమే ఈ టెస్ట్ లక్ష్యం.

మాక్ డ్రిల్ వినియోగదారులకు నోటిఫికేషన్ పంపుతుందో లేదో ఇంకా నిర్ధారించలేదు. కానీ, వారి హ్యాండ్‌సెట్‌లో ఎమర్జెన్సీ అలర్ట్స్ ఎలా ఎనేబుల్ చేయాలో మాత్రం ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు Android 11 లేదా కొత్త ఫోన్ వాడుతుంటే.. మీరు ఈ అలర్ట్స్ అందుకోవచ్చు. కానీ, ఈ ఫీచర్ ఆన్ చేసి ఉంటేనే అలర్ట్స్ అందుకోగలరు.

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్స్ ఎనేబుల్ ఇలా.. :

  • Settings ఓపెన్ చేయండి.
  • Safety and Emergency ఆప్షన్ కోసం కిందికి స్క్రోల్ చేయండి.
  • వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ ఆప్షన్ ట్యాప్ చేయండి.
  • ఆల్ అలర్ట్స్ ఆప్షన్ ఆన్ చేయండి.

Note : శాంసంగ్ (One UI), షావోమీ (HyperOS) లేదా OnePlus వంటి ఫోన్‌లలో కచ్చితమైన నిబంధనలు మారవచ్చు. యాక్టివ్ SIM లేకుండా లేదా రోమింగ్‌లో ఉన్నప్పుడు కూడా అలర్ట్స్ అందుకోవచ్చు.

ఐఫోన్ యూజర్లు గవర్నమెంట్ టెస్ట్ అలర్ట్స్ ఎలా ఎనేబుల్ చేయాలి? :
ఆపిల్ ఐఫోన్‌లు ప్రభుత్వ ఎమర్జెన్సీ అలర్ట్స్ కూడా సపోర్టు ఇస్తాయి. మాక్ డ్రిల్‌లతో సహా అన్ని యాక్సస్ చేయొచ్చు.

ఐఫోన్‌లో అలర్ట్స్ యాక్టివేట్ చేయాలంటే? :

  • Settings వెళ్లండి
  • ‘Notifications’లపై ట్యాప్ చేయండి.
  • కిందికి స్క్రోల్ చేసి ‘Government Alerts’ కోసం సెర్చ్ చేయండి.
  • టెస్ట్ అలర్ట్స్ టోగుల్‌ను ఎనేబుల్ చేయండి.

ఇది ఎందుకు ముఖ్యమంటే.. దేశవ్యాప్తంగా భారతీయ పౌరులను సంసిద్ధంగా ఉండేలా అప్రమత్తం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. సెప్టెంబర్ 2024లో ఢిల్లీ-NCRలోని చాలా మంది వినియోగదారులు DoT నుంచి శాంపిల్ అలర్ట్ అందుకున్నారు. “ఇది టెలికమ్యూనికేషన్ విభాగం సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పంపిన శాంపిల్ టెస్టింగ్ మెసేజ్.. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు” అని మెసేజ్ రాసి ఉంది.

ప్రకృతి వైపరీత్యాలు, ఉగ్రవాద బెదిరింపులు లేదా ఏదైనా జాతీయ అత్యవసర పరిస్థితులకు రియల్-టైమ్ అలర్ట్స్ పంపడానికి ఈ సిస్టమ్స్ భారత సంసిద్ధత వ్యూహంలో భాగమని గమనించాలి.

Read Also : Essential Gadgets : యుద్ధం వంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రతి భారతీయుడి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన 5 ముఖ్యమైన గాడ్జెట్‌లివే..!

అప్రమత్తంగా ఉండండి :
ఈ ఎమర్జెన్సీ టెస్ట్ భయాందోళనకు కారణం కాదు. విపత్తు, అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండేందుకు ఒక అడుగు. మీ ఫోన్‌లో ఇలా ఎమర్జెన్సీ అలర్ట్స్ ఎనేబుల్ చేసుకోండి. స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా ఫోన్ ఎమర్జెన్సీ అలర్ట్ ఎనేబుల్ చేసుకోవని ప్రోత్సహించండి.