iPhone 16 Pro Max : భలే డిస్కౌంట్ బాస్.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఇంత తక్కువా.. బ్యాంకు ఆఫర్లతో ఇంకా తగ్గింపు ధరకే..!

iPhone 16 Pro Max : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. బ్యాంకు ఆఫర్లతో ఇంకా తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు.

iPhone 16 Pro Max : భలే డిస్కౌంట్ బాస్.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఇంత తక్కువా.. బ్యాంకు ఆఫర్లతో ఇంకా తగ్గింపు ధరకే..!

iPhone 16 Pro Max

Updated On : May 7, 2025 / 11:48 AM IST

iPhone 16 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 16 ప్రో మాక్స్ కొనాలని చూస్తుంటే ఇదే సరైన సమయం. విజయ్ సేల్స్ ద్వారా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధరను భారీగా తగ్గిస్తుంది. ఈ ఆఫర్‌తో రూ. 15,700 వరకు సేవ్ చేసుకోవచ్చు.

Read Also : Realme 14 Pro Plus : ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే.. రూ.32వేల రియల్‌‌మి ఫోన్ కేవలం రూ. 12వేల లోపే.. డోంట్ మిస్! 

మీరు పాత ఐఫోన్ నుంచి అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా మరో బ్రాండ్ నుంచి ఎక్స్ఛేంజ్ చేసుకోవాలన్నా ఈ డీల్ అసలు వదులుకోవద్దు. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ కాలం ఉండవు. మీకు ఐఫోన్ కొనాలని ఉంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఈ డీల్ వివరాలను ఓసారి లుక్కేయండి.

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ డీల్ :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్రో మాక్స్ రూ. 1,44,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఈ ప్రీమియం హ్యాండ్‌సెట్ రూ. 1,33,700 కు లిస్ట్ అయింది. రిటైలర్ ఐఫోన్ 16 ప్రో మాక్స్‌పై ఫ్లాట్ రూ. 11,200 తగ్గింపును అందిస్తోంది.

మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ. 3వేలు తగ్గింపును పొందవచ్చు. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో రూ. 4,500 తగ్గింపును పొందవచ్చు.

ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. ఈ ఐఫోన్ టైటానియం డిజైన్, అప్‌గ్రేడ్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.

హుడ్ కింద ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 3nm A18 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఐఫోన్ Genmoji, ఇమేజ్ ప్లేగ్రౌండ్, సిరితో చాట్‌జీపీటీ సపోర్ట్ సహా అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది.

Read Also : Samsung Galaxy S25 Ultra : అదిరిపోయే ఆఫర్.. ఈ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై రూ. 42వేలు డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!

ఆప్టిక్స్ పరంగా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 48MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రావైడ్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 12MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లో 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.