Realme 14 Pro Plus : ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే.. రూ.32వేల రియల్‌‌మి ఫోన్ కేవలం రూ. 12వేల లోపే.. డోంట్ మిస్!

Realme 14 Pro Plus : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ అందిస్తోంది.. రియల్‌మి 14ప్రో ప్లస్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

Realme 14 Pro Plus : ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే.. రూ.32వేల రియల్‌‌మి ఫోన్ కేవలం రూ. 12వేల లోపే.. డోంట్ మిస్!

Realme 14 Pro Plus

Updated On : May 7, 2025 / 9:53 AM IST

Realme 14 Pro Plus : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. ఇదే సరైన సమయం. రియల్‌మి 14 ప్రో ప్లస్‌ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

బేస్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ రూ. 31,999 ప్రారంభ ధర ఉండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 28వేల కన్నా తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ కర్వ్ డిస్‌ప్లే, 50MP ఎల్ఈడీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తుంది.

Read Also : Moto G56 5G : ఖతర్నాక్ ఫీచర్లతో మోటో G56 5G ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!

రియల్‌మి 14 ప్రో ప్లస్ కొనాలని చూస్తుంటే.. డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు మరిన్నింటిని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి 14 ప్రో ప్లస్ డిస్కౌంట్ :
రియల్‌మి 14ప్రో ప్లస్ (8GB ర్యామ్ + 128GB స్టోరేజ్) ప్రస్తుతం రూ.29,999 ధరకు అమ్ముడవుతోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై రూ.2వేల బ్యాంక్ డిస్కౌంట్‌ అందిస్తోంది.

కొనుగోలుదారులు ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా, రూ.2,500 నుంచి నో-కాస్ట్ నెలవారీ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ యూజర్లు 5శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. ఎంపిక చేసిన ఫోన్ మోడళ్లపై రూ.16,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ. 32వేల విలువైన రియల్‌మి ఫోన్ కేవలం రూ. 12వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

రియల్‌మి 14ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు :
రియల్‌మి 14 ప్రో ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో 6.83-అంగుళాల క్వాడ్-కర్వ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 12GB వరకు LPDDR4X, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 5G చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత రియల్‌మి యూఐ 6 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది.

కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OISతో కూడిన 50MP ప్రైమరీ షూటర్, 50MP పెరిస్కోప్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి.

Read Also : 2025 Yamaha Aerox 155 : బైక్ భలే ఉంది బాస్.. యమహా ఏరోక్స్ 155 బైక్ అదుర్స్.. కొత్త కలర్లతో కేక పుట్టిస్తోంది..!

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్‌లో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. అదనంగా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ బికనీర్ పర్పుల్, పెర్ల్ వైట్, సూడ్ గ్రే వంటి 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.