Samsung Galaxy S25 Ultra : అదిరిపోయే ఆఫర్.. ఈ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై రూ. 42వేలు డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ ధర భారీగా తగ్గింది. అర్హత కలిగిన కొనుగోలుదారులు రూ. 87,649కు అందుబాటులో ఉంది.

Samsung Galaxy S25 Ultra
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్ ప్రస్తుతం గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ కోసం చూస్తున్న వారికి వివిధ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ. 42వేలు సేవ్ చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా డిస్కౌంట్ :
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ప్రారంభ ధర రూ.1,29,999కి అందుబాటులో ఉంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌పై ఫ్లాట్ 18 శాతం తగ్గింపును పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఫోన్ ధర రూ.1,05,999కి తగ్గుతుంది.
అదనంగా, ప్లాట్‌ఫామ్ రూ.61వేల వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను అందిస్తోంది. 256GB స్టోరేజ్ ఉన్న పాత ఐఫోన్ 12ని ట్రేడ్ చేస్తే.. మీరు రూ.18,350 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ధరను కేవలం రూ.87,649కే కొనేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. అద్భుతమైన 6.9-అంగుళాల డైనమిక్ 2X అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
45W వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. బ్యాక్ సైడ్ మల్టీఫేస్ క్వాడ్-కెమెరా సెటప్‌ను పొందవచ్చు. 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, రెండు 12MP కెమెరాలు ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ యూఐ 7పై రన్ అయ్యే ఈ శాంసంగ్ ఫోన్ గూగుల్ జెమిని ఏఐ ఫీచర్లతో వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 1,29,999 ఉండగా, అమెజాన్ సేల్‌లో కేవలం రూ. 84,999కు కొనుగోలు చేయవచ్చు.