Top Smartphones : ఫోన్లు అంటే ఇలా ఉండాలి.. రూ. 35వేల లోపు టాప్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లివే.. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి..!
Top Smartphones : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? రూ.35వేల లోపు టాప్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Top Smartphones
Top Smartphones : మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్, నథింగ్, సీఎంఎఫ్ నథింగ్ వంటి అనేక బ్రాండ్‌లు ఇటీవల లేటెస్ట్ హ్యాండ్‌సెట్‌ను రిలీజ్ చేశాయి.
కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లేటెస్ట్ ఫీచర్లు, ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ పర్ఫార్మెన్స్, అప్‌గ్రేడ్ కెమెరాలు, ప్రీమియం డిజైన్‌లతో వస్తాయి. మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు 4 స్మార్ట్‌ఫోన్‌లను మీకోసం అందిస్తున్నాం. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
1. నథింగ్ ఫోన్ 3a ప్రో :
నథింగ్ ఫోన్ 3a ప్రో సిగ్నేచర్ ట్రాన్స్పరెంట్ కొత్త సర్కిల్ కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్‌లో ప్రో-లెవల్ జూమ్ కోసం 50MP మెయిన్స్ 50MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి.
పవర్‌ఫుల్ 6.77-అంగుళాల అమోల్డ్ ప్యానెల్ 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3, 12GB ర్యామ్, 50W ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది. కొత్తగా కస్టమైజడ్ “ఎసెన్షియల్ కీ” స్మార్ట్ యుటిలిటీని కలిగి ఉంది.
2. వన్‌ప్లస్ నార్డ్ 4 5G :
వన్‌ప్లస్ నార్డ్ 4 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 చిప్, 120Hz అమోల్డ్ స్క్రీన్, మెటల్ యూనిబాడీతో వస్తుంది. 5,500mAh బ్యాటరీ కూడా ఉంది. కేవలం 30 నిమిషాల్లో సున్నా నుంచి ఫుల్ ఛార్జింగ్‌కు 100W పవర్ కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ 6 ఏళ్లు అప్‌డేట్స్ కూడా అందిస్తుంది.
3. పోకో X7 ప్రో 5G :
పవర్-ప్యాక్డ్, బడ్జెట్-ఫ్రెండ్లీ, పోకో X7 ప్రో 5G డైమెన్సిటీ 8400 అల్ట్రా చిప్‌ను అందిస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 6,550mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్ 3,200 నిట్ బ్రైట్‌నెస్, IP68 సర్టిఫికేషన్, స్టీరియో స్పీకర్లు, మల్టీఫేస్ ట్రిపుల్-కెమెరా సెటప్ 50MP మెయిన్‌తో మల్టీమీడియా ఆప్షన్లను కలిగి ఉంది.
4. శాంసంగ్ గెలాక్సీ A36 5G :
శాంసంగ్ గెలాక్సీ A36 5G ఫోన్ బిగ్ అమోల్డ్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 3 ప్రాసెసర్, బిల్డ్‌తో అప్‌గ్రేడ్ చేస్తుంది. ఇప్పుడు 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది.
శాంసంగ్ బ్రాండ్ 6 ఏళ్లు OS, సెక్యూరిటీ అప్‌డేట్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ యూఐ 7తో యూజర్లకు సరైన ఆప్షన్ అని చెప్పొచ్చు.