HDFC Bank : కస్టమర్లకు గుడ్ న్యూస్.. రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన HDFC బ్యాంకు.. మే 7 నుంచే కొత్త రేట్లు అమల్లోకి.. ఈఎంఐలు తగ్గుతాయా?

HDFC Bank : కొత్త MCLR రేటు మే 7, 2025 నుంచి అమలులోకి వచ్చింది. RBI రెపో రేటును తగ్గించిన తర్వాత, HDFC బ్యాంక్ MCLRను తగ్గించాలని నిర్ణయించింది.

HDFC Bank : కస్టమర్లకు గుడ్ న్యూస్.. రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన HDFC బ్యాంకు.. మే 7 నుంచే కొత్త రేట్లు అమల్లోకి.. ఈఎంఐలు తగ్గుతాయా?

HDFC Bank

Updated On : May 7, 2025 / 6:09 PM IST

HDFC Bank : హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్‌లో లోన్ తీసుకున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. HDFC బ్యాంకు కొన్ని లోన్లపై రుణ రేట్లను తగ్గించింది. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) తగ్గించింది.

Read Also : SIP Calculator : మీకు ఈ నెల జీతం పడిందా? ప్రతి నెలా SIPలో రూ.5వేలు పెట్టుబడితో ఎన్ని ఏళ్లలో రూ.1 కోటి సంపాదించవచ్చంటే

బ్యాంక్ MCLRని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 15 బేసిస్ పాయింట్లు (bps)వరకు తగ్గించింది. ఎంపిక చేసిన రుణ కాలపరిమితిపై బ్యాంక్ MCLRను 0.15 శాతం తగ్గించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు మే 7, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. రుణ వడ్డీ రేట్లు ఉన్న రుణదాతలకు ప్రయోజనం కలగనుంది.

ఇప్పుడు, HDFC బ్యాంక్ MCLR అనేది తీసుకున్న లోన్ టెన్యూర్ బట్టి 9.00శాతం నుంచి 9.20శాతం వరకు ఉంటుంది. గతంలో, ఈ లోన్ రేట్లు 9.10శాతం నుంచి 9.35శాతం మధ్య ఉండేవి. ఈ రేట్లు తగ్గింపుతో ఈఎంఐ నెలవారీ వాయిదాలు తగ్గుతాయి. కొంతవరకు రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించే విషయంగా చెప్పవచ్చు.

బ్యాంకు రేట్లు ఎందుకు తగ్గిస్తుందంటే? :
గత ఏప్రిల్‌లో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన వెంటనే బ్యాంకు రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. గత ఫిబ్రవరి 2025 నుంచి మొత్తం కోత 50 బేసిస్ పాయింట్లకు చేరుకుంది.

రెపో రేటు తగ్గినప్పుడు బ్యాంకులకు నిధుల ఖర్చు తగ్గుతుంది. HDFC బ్యాంక్‌తో సహా అనేక రుణదాతలు ఇప్పుడు తమ రుణ రేట్లను తగ్గించడంతో వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది.

MCLR అంటే ఏంటి?
ఎంసీఎల్ఆర్ (MCLR) అంటే.. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్. ఆర్బీఐ అనుమతిస్తే.. తప్ప బ్యాంకులు దీని కన్నా తక్కువ రుణం ఇవ్వలేని కనీస రేటు. గృహ రుణాలు, కారు లోన్లు, వ్యక్తిగత రుణాలు వంటి ఫ్లోటింగ్-రేట్ రుణాలపై వడ్డీని నిర్ణయించే బ్యాంకులకు బెంచ్‌మార్క్ రేటు ఇది.

మీరు MCLRతో రుణం తీసుకుంటే.. ఈ రేటులో తగ్గింపుతో పాటు ఈఎంఐ కూడా తగ్గుతాయి. లేదా మీ లోన్ తొందరగా పూర్తి అవుతుంది. అది కూడా మీరు తీసుకున్న లోన్ తేదీతో పాటు ఫిక్స్ డ్, ఫ్లోటింగ్ రేట్ రుణమా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

కొత్త MCLR రేట్లు ఇవే :
HDFC బ్యాంక్ వివిధ కాలపరిమితి రుణాలపై MCLR రేట్లను తగ్గించింది. ఒక నెల కాలపరిమితి రుణాలపై వడ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్లు తగ్గి 9శాతానికి చేరుకున్నాయి. మూడు నెలల రేటు 15 బేసిస్ పాయింట్లు తగ్గి 9.05శాతానికి చేరుకుంది.

Read Also : 8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. భారీగా పెరగనున్న ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు.. ఎంత ఉండొచ్చంటే 

6 నెలల రేటు ఇప్పుడు 9.15శాతంగా ఉండగా.. 15 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత ఒక ఏడాది MCLR 9.15శాతం వద్ద ఉంది. రెండు ఏళ్లు, మూడు ఏళ్ల రేట్లు రెండూ 9.20శాతానికి తగ్గాయి.