Motorola razr 60 Ultra : మోటోరోలా మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 13నే లాంచ్.. ఫోల్డబుల్ ఫోన్ కిర్రాక్ ఫీచర్లు.. గెట్ రెడీ!

Motorola razr 60 Ultra : మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది. రాబోయే మోటోరోలా రెజర్ 60 అల్ట్రా ఫోన్ డిజైన్ కెమెరా, ప్రాసెసర్ కలిగి ఉండొచ్చు.

Motorola razr 60 Ultra : మోటోరోలా మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 13నే లాంచ్.. ఫోల్డబుల్ ఫోన్ కిర్రాక్ ఫీచర్లు.. గెట్ రెడీ!

Motorola razr 60 Ultra

Updated On : May 9, 2025 / 4:39 PM IST

Motorola razr 60 Ultra : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి మోటోరోలా రేజర్ 60 అల్ట్రా 5G ఫోన్ వచ్చేస్తోంది. క్లామ్‌షెల్-స్టయిల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మే 13, 2025న రిలీజ్ కానుంది. అధికారిక లాంచ్ ముందు కంపెనీ డిజైన్, కీలక స్పెసిఫికేషన్‌లు, ఇతర వివరాలను టీజ్ చేసింది.

Read Also : Pakistan Hackers : బిగ్ అలర్ట్.. భారతీయ బ్యాంకులు, సోషల్ మీడియా యూజర్లే టార్గెట్.. పాకిస్తాన్ హ్యాకర్లతో ముప్పు..!

ఈ మడతబెట్టే ఫోన్ అమెజాన్ ద్వారా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జ్ అయ్యే ఫ్లిప్ ఫోన్ అని చెప్పొచ్చు.

ఈ మోటోరోలా ఫోన్ మౌంటైన్ ట్రైల్, రియో ​​రెడ్, స్కారాబ్ షేడ్స్ 3 కలర్ ఆప్షన్లలో రానుంది. రాబోయే మోటోరోలా రెజర్ 60 అల్ట్రా ఫోన్ డిజైన్ కెమెరా, ప్రాసెసర్ కలిగి ఉండొచ్చు.

మోటోరోలా రేజర్ 60 అల్ట్రా డిజైన్, స్పెసిఫికేషన్లు :
రాబోయే మోటోరోలా రేజర్ 60 అల్ట్రా కొత్తగా రీడిజైన్ టైటానియం హింజ్, మెయిన్ లోపలి డిస్‌ప్లేపై హోల్ పంచ్ డిజైన్, సన్నని బెజెల్స్, కవర్ డిస్‌ప్లేపై డ్యూయల్ అవుట్‌వర్డ్-ఫేసింగ్ కెమెరాలతో వస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ రియో ​​రెడ్, స్కారాబ్, మౌంటైన్ ట్రైల్ షేడ్స్ కోసం వరుసగా అల్కాంటారా, వీగన్ లెదర్, వుడ్ ఫినిష్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

స్పెసిఫికేషన్ల పరంగా, ఈ స్మార్ట్‌ఫోన్ 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని చెప్పవచ్చు.

ఈ హ్యాండ్‌సెట్ రీడిజైన్ టైటానియం హింజ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ కవర్ డిస్‌ప్లే ప్రొటెక్షన్, IP48 రేటింగ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ 50MP సెన్సార్‌లు, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 50MP సెన్సార్‌తో వచ్చిన మొట్టమొదటి ఫ్లిప్ ఫోన్‌గా చెప్పవచ్చు.

ఈ హ్యాండ్‌సెట్ మోటో ఏఐ 2.0 సూట్ ఫీచర్లతో కూడా వస్తుంది. ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ఏప్రిల్ 2025లో లాంచ్ కాగా, గ్లోబల్ కౌంటర్ మాదిరిగానే ఫీచర్లతో రావచ్చని పుకార్లు సూచిస్తున్నాయి.

ఈ ఫోన్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో 7-అంగుళాల pOLED LTPO ఇన్నర్ డిస్‌ప్లే, 4-అంగుళాల pOLED LTPO కవర్ డిస్‌ప్లేను పొందవచ్చు. 68W ఫాస్ట్ ఛార్జింగ్, 30w వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,700mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు.

Read Also : Dance Hillary Virus : పాక్ హ్యాకర్ల పనే.. ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్.. వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా వ్యాపిస్తుందా? భారతీయ యూజర్లు జాగ్రత్త..!

మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ధర (అంచనా) :
మోటోరోలా రాబోయే రెజర్ 60 అల్ట్రా ధరను ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర దాదాపు రూ. 1,11,000 ఉంటుందని భావిస్తున్నారు. గత ఏడాదిలో మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ప్రారంభ ధర రూ. 99,999కి లాంచ్ అయింది.