Dance Hillary Virus : పాక్ హ్యాకర్ల పనే.. ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్.. వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా వ్యాపిస్తుందా? భారతీయ యూజర్లు జాగ్రత్త..!

Dance Hillary Virus : పాకిస్తానీ హ్యాకర్లు వాట్సాప్, ఫేస్‌బుక్, ఈమెయిల్స్ ద్వారా వ్యాప్తి చేసే 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' అనే డేంజరస్ మాల్వేర్‌పై నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

Dance Hillary Virus : పాక్ హ్యాకర్ల పనే.. ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్.. వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా వ్యాపిస్తుందా? భారతీయ యూజర్లు జాగ్రత్త..!

Dance Hillary Virus

Updated On : May 9, 2025 / 3:30 PM IST

Dance Hillary Virus : భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య భారతీయ పౌరులపై సైబర్ ముప్పు పొంచి ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అనేక రకాల సైబర్ దాడులకు గురవుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి.

Read Also : Pakistan Hackers : బిగ్ అలర్ట్.. భారతీయ బ్యాంకులు, సోషల్ మీడియా యూజర్లే టార్గెట్.. పాకిస్తాన్ హ్యాకర్లతో ముప్పు..!

డాన్స్ ఆఫ్ ది హిల్లరీ వైరస్ వంటి మాల్వేర్ ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు సూచిస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇమెయిల్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారాల్లో వీడియో లేదా డాక్యుమెంట్ మాదిరిగా ఉన్న ఈ మాల్వేర్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత యూజర్ల వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దొంగిలిస్తుందని హెచ్చరిస్తోంది. భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని లింక్‌లు లేదా అటాచ్‌మెంట్‌లను నివారించాలని హెచ్చరిస్తున్నారు.

‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ అంటే ఏంటి? :
‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ అనేది సీక్రెట్ డేటాను దొంగిలించగలదు. డిజిటల్ డివైజ్‌లను డ్యామేజ్ చేయగలదు. ఈ డేంజరస్ మాల్వేర్ వినియోగదారులను సాధారణంగా కనిపించే ఫైల్స్ మాదిరిగా ఉంటుంది.

వీడియో క్లిప్‌లు లేదా డాక్యుమెంట్లను ఓపెన్ చేసేలా ఉంటుంది. యాక్సెస్ చేసిన తర్వాత సైలెంట్‌‌గా వైరస్‌ను బ్యాక్ గ్రౌండ్ ఇన్‌స్టాల్ చేస్తుంది. హ్యాకర్లకు డివైజ్‌పై ఫుల్ కంట్రోల్ అందిస్తుంది.

ఈ మాల్వేర్ ఏం చేయగలదంటే? :

  • బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం
  • ప్రైవసీ ఫైళ్లను యాక్సెస్ చేయడం, లీక్ చేయడం
  • డివైజ్‌లు స్లో కావడం లేదా క్రాష్ చేయడం
  • ఫోన్‌లు, కంప్యూటర్‌లను రిమోట్‌గా కంట్రోల్ చేయగలదు.
  • ఇందులో “tasksche.exe” అనే ఫైల్‌‌తో జాగ్రత్తగా ఉండాలి.
  • మాల్వేర్ ఎక్జిక్యూటబుల్ ఫైల్ .exeతో ఉండే ఏదైనా ఫైల్‌ను ఓపెన్ చేయొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ హిల్లరీ వైరస్ ఎలా వ్యాపిస్తుంది? :

  • వైరస్ ఈ కింది విధంగా వ్యాపిస్తుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
  • వీడియో అటాచ్‌మెంట్‌లతో వాట్సాప్ ఫార్వార్డ్ చేస్తుంది.
  • ఫేక్ జాబ్ ఇంటర్వ్యూ ఈమెయిల్స్ లేదా ప్రభుత్వ సర్క్యులర్లు.
  • తప్పుదారి పట్టించే URLలతో ఫేస్‌బుక్ పోస్ట్‌లు
  • హైడెడ్ ఫైళ్లతో టెలిగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) మెసేజ్‌లు
  • హ్యాకర్లు ఈ ఫైళ్లపై వినియోగదారులు క్లిక్ చేసేలా ప్రేరేపిస్తారు.

సోషల్ మీడియా యూజర్లు ఏం చేయాలి? :
ఈ ప్రత్యేక మాల్వేర్ డివైజ్‌ల నుంచి సున్నితమైన సమాచారాన్ని హ్యాక్ చేయగలదు. ఈ మాల్వేర్ వినియోగదారులపై ప్రభావం ఉంటుందని అనేందుకు రుజువు లేనప్పటికీ, మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Read Also : NASA Space Rock : నాసా హెచ్చరిక.. స్టేడియం సైజంత పెద్దది.. భారీ గ్రహశకలం దూసుకొస్తోంది.. మన గ్రహాన్ని ఢీకొట్టనుందా?

  • గుర్తుతెలియని లింక్‌లను లేదా ఫైల్‌లను ఓపెన్ చేయొద్దు.
  • వాట్సాప్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో “మీడియా ఆటో-డౌన్‌లోడ్” ఫీచర్‌ను ఆఫ్ చేయండి.
  • యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి అప్‌డేట్ చేసుకోండి.
  • అనుమానాస్పద ఫేస్‌బుక్ లేదా వాట్సాప్ మెసేజ్‌లను క్లిక్ చేయడం మానుకోండి.
  • స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి.
  • టూ ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయండి.
  • ముఖ్యమైన డేటాను క్రమం తప్పకుండా బ్యాకప్ చేయండి.