OnePlus Nord CE 4 Lite : అమెజాన్‌లో వన్‌ప్లస్ 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇంత తక్కువకే వస్తుంటే అసలు వదులుకోవద్దు!
OnePlus Nord CE 4 Lite : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ ఫోన్ తగ్గింపు ధరకే పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

OnePlus Nord CE 4 Lite
OnePlus Nord CE 4 Lite : వన్‌ప్లస్ కొత్త ఫోన్ కొంటున్నారా? ఆకర్షణీయమైన డిజైన్, సరికొత్త ఫీచర్లతో రూ.16వేల కన్నా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ (OnePlus Nord CE 4 Lite) అమెజాన్‌లో ఈ ఫోన్ ధరను రూ.5వేలకు తగ్గించింది.
బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర ప్రారంభంలో రూ.20,999కు అందుబాటులో ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరా పర్ఫార్మెన్స్, బిగ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఆఫర్ ద్వారా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5Gని రూ.16వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5G డిస్కౌంట్ :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5G రూ.20,999 లాంచ్ ధరపై రూ.3,001 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.17,998కి అమ్ముడవుతోంది. అదనంగా, ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.2వేలు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఉంది.
పాత ఫోన్‌లపై రూ.16,850 ఎక్స్ఛేంజ్ వాల్యూ కూడా ఉంది. అయితే, మొత్తం ఎక్స్ఛేంజ్ వాల్యూ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5G స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5Gలో FHD+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. 8GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది.
స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్ OS 14పై రన్ అవుతుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5G డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 16MP సెన్సార్ ఉంది. ఈ వన్‌ప్లస్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీకి సపోర్టు ఇస్తుంది.