Gold and Silver Rates Today : మరోసారి బంగారం, వెండి ధరలు ఢమాల్.. ఏకంగా 20వేలు తగ్గుదల.. నేటి ధరలు ఇవే..
Gold and Silver Rates Today : గడిచిన నాలుగు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే, మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పడిపోయాయి.

బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు భారీ శుభవార్త. బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా తగ్గాయి.

గడిచిన నాలుగు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే, మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. గంటల వ్యవధిలోనే వీటి ధరలు ఢమాల్ మంటూ పడిపోయాయి.

మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.1,420 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1,300 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ 189 డాలర్లు పెరిగి.. ప్రస్తుతం 4,823 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

వెండి ధరసైతం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 20వేలు తగ్గింది. దీంతో గడిచిన ఐదు రోజుల్లో కిలో వెండిపై రూ.1.45లక్షలు తగ్గుదల చోటు చేసుకోవటం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,39,100 వద్దకు పడిపోగా.. 24క్యారట్ల ధర రూ.1,51,750 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,39,250కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,51,900కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,39,100కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,51,750కు వద్దకు చేరింది.

ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.20వేలు తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,80,000కు పడిపోయింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,80,000 వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
