Telugu » Photo-gallery » Gold And Silver Price In Hyderabad Visakhapatnam Delhi Today February 3rd 2026 Full Details Hn
Gold and Silver Rates Today : మరోసారి భారీగా పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి రేటు.. నేటి ధరలు ఇవే..
Gold and Silver Rates Today : గడిచిన నాలుగు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే, మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పడిపోయాయి.
Gold Rates Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. బంగారం ధర భారీగా పెరగ్గా.. వెండి ధర భారీగా తగ్గింది.
2/8
గడిచిన నాలుగు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే, మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర పెరగ్గా.. వెండి ధర మరోసారి తగ్గింది. గంటల వ్యవధిలోనే వెండి రేటు ఢమాల్ మంటూ పడిపోయాయి.
3/8
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.760 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.700 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 300డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 4,934 డాలర్లు వద్ద ట్రేడవుతోంది.
4/8
వెండి ధరసైతం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 20వేలు తగ్గింది. దీంతో గడిచిన ఐదు రోజుల్లో కిలో వెండిపై రూ.1.45లక్షలు తగ్గుదల చోటు చేసుకోవటం గమనార్హం.
5/8
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,41,100 వద్దకు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,53,930కు చేరింది.
6/8
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,41,250కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,54,080కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,41,100కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,53,930కు వద్దకు చేరింది.
7/8
ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.20వేలు తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,80,000కు పడిపోయింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,80,000 వద్దకు చేరింది.
8/8
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.