×
Ad

PM Kisan 21st Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ షాక్.. 31 లక్షల మందికి 21వ విడత రూ.2వేలు పడవు.. మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి!

PM Kisan 21st Installment Date : పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిపొందే 31 లక్షల కుటుంబాల రైతులు ఈసారి 21వ విడత రూ. 2వేలు అందుకోలేరు. ఎందుకంటే?

PM Kisan Yojana

PM Kisan 21st Installment Date : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఇలాంటి రైతుల కుటుంబాలు పీఎం కిసాన్ విడత డబ్బులు అందుకోలేరు. ఒకే కుటుంబంలో ఎక్కువ మంది పీఎం కిసాన్ విడత డబ్బులు అందుకుంటున్నట్టుగా తేలింది. ఈ నేపథ్యంలో ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన’ కింద భార్యాభర్తలు ఇద్దరూ డబ్బు అందుకుంటున్న కుటుంబాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. పీఎం కిసాన్ పథకం నుంచి కనీసం 31 లక్షల మంది భార్యాభర్తలు ద్వంద్వ లబ్ధిదారులు ప్రయోజనం పొందారని గుర్తించారు.

పథకం నిబంధనల ప్రకారం.. కుటుంబంలో ఇంటి యజమాని (PM Kisan 21st Installment Date) ఒక సభ్యునికి మాత్రమే రూ. 2వేలు తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటే వారు అర్హులు కారు. ఒకవేళ అలా ఉంటే వెంటనే ఆ పేరును తొలగించే అవకాశం ఉంది.

మీరు ‘పీఎం కిసాన్’ హిట్ లిస్ట్‌లో ఉన్నారా? :
పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాల ప్రకారం.. మినహాయింపు ప్రమాణాల కిందకు వచ్చే 19 లక్షల అనుమానిత కేసులను ఈ శాఖ ఇప్పటికే ధృవీకరించింది. ఇలాంటి లబ్ధిదారులను అక్టోబర్ 15, 2025 నాటికి, 21వ విడత పూర్తిగా పంపిణీ అయ్యే ముందు పేమెంట్ జాబితా నుంచి తొలగిస్తారు. ఇప్పటికే, రూ. 2000 ఆర్థిక సాయాన్ని పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. జమ్మూ-కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సహా అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఈ మొత్తాన్ని అందుకున్నాయి.

పీఎం కిసాన్ 21వ వాయిదా స్టేటస్ చెక్ చేయాలంటే? :

  • ‘పీఎం కిసాన్ 21వ వాయిదా’ స్టేటస్ ఇలా చెక్ చేయొచ్చు.
  • అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in) విజిట్ చేయండి.
  • ‘Farmers Corner’ కి వెళ్ళండి.
  • ‘Beneficiary Status’పై క్లిక్ చేయండి.
  • ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయండి
  • మీరు ఇప్పుడు ‘Beneficiary List’ కింద మీ గ్రామ జాబితాను చెక్ చేయవచ్చు.

3 వాయిదాలలో రూ. 6వేలు వార్షిక సాయం :
ఈ పీఎం కిసాన్ పథకం రైతులకు కనీసం రూ. 6వేలు వార్షిక ఆదాయాన్ని అందిస్తుంది. ఈ ఆదాయం 3 సమాన వాయిదాలలో రైతులకు పంపిణీ అవుతుంది. రిజిస్టర్ చేసుకున్న రైతులందరికీ ఇ-కేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఇకేవైసీ కోసం రైతులు అధికారిక పీఎం కిసాన్ పోర్టల్‌ను విజిట్ చేయొచ్చు.

బయోమెట్రిక్ ఆధారిత ఇ-కేవైసీ కోసం తమ సమీపంలోని CSC సెంటర్లను సందర్శించాలి. మరిన్ని వివరాల కోసం రైతులు పీఎం కిసాన్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా కిసాన్ ఈమిత్రా చాట్‌బాట్ నో యువర్ స్టేటస్ (KYS)లో తమ అర్హత స్టేటస్ చెక్ చేయవచ్చు.

ఇ-కేవైసీ లేదా ఆధార్ లింక్ చేయండి :
ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదా? బ్యాంకు అకౌంటుతో ఆధార్‌ను లింక్ చేయలేదా? ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తి చేయని రైతులకు పీఎం కిసాన్ 21వ విడత అందదు. తప్పుగా బ్యాంకింగ్ వివరాలు ఉన్నవారు కూడా రూ. 2వేలు అందుకోలేరు. ఇలాంటి పరిస్థితిలో రైతులు ఈ పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తయ్యేలా చూసుకోండి.

ఇ-కేవైసీ ప్రాసెస్ ఇలా :
రైతులు పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ (pmkisan.gov.in) విజిట్ చేయాలి. తమ ఆధార్ నంబర్, OTP ఎంటర్ చేయాలి. తద్వారా ఇ-కేవైసీని ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు. బయోమెట్రిక్స్ వెరిఫికేషన్ కోసం తమ సమీపంలోని CSC సెంటర్లు లేదా బ్యాంకులకు వెళ్లవచ్చు.