PM Kisan 22nd Instalment ( Image Credit : Google Gemini AI )
PM Kisan 22nd Instalment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏడాదిలో రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తోంది.
ఈ విడత ఫిబ్రవరిలో విడుదల అవుతుందా? లేదా అనేది అతిపెద్ద ప్రశ్న. ప్రస్తుతానికి రాబోయే విడత తేదీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ మొత్తాన్ని ఫిబ్రవరి 2026లో రైతుల ఖాతాలకు పంపిణీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం.. పీఎం కిసాన్ 22వ విడత 25 ఫిబ్రవరి 2026 తర్వాత విడుదల అవుతుందనే చర్చ జరుగుతోంది.
పీఎం కిసాన్ 22వ విడత విడుదల ఎప్పుడంటే? :
పీఎం కిసాన్ 22వ విడత అధికారిక తేదీని వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ విడత ఫిబ్రవరి చివరి వారంలో లేదా 2026 మార్చి ప్రారంభంలో విడుదల కావచ్చని అంచనా.
Read Also : Vivo V60 5G : వారెవ్వా.. వండర్‌ఫుల్ ఆఫర్.. ఈ వివో 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?
21వ విడత ముందుగా 2025 నవంబర్ 19న రైతుల ఖాతాలకు విడుదల అయింది. రాబోయే 22వ విడత కూడా అతి త్వరలో విడుదల కావచ్చని అంచనా. వాయిదాకు సంబంధించి ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు రైతులు తమ e-KYC, బ్యాంక్ అకౌంట్, ఆధార్ లింకింగ్ స్టేటస్ ముందుగానే చెక్ చేసుకోవడం బెటర్.
రైతులకు e-KYC ఎందుకంటే? :
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో పారదర్శకత కోసం మోసపూరిత లబ్ధిదారులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం e-KYCని తప్పనిసరి చేసింది. e-KYC ప్రక్రియను పూర్తి చేయని రైతులు వారి తర్వాతి వాయిదాను పొందలేరు. అందుకే రూ. 2వేలు వాయిదాను పొందాలంటే ఆయా రైతులు తమ అకౌంట్ కేవైసీని సకాలంలో పూర్తి చేయాలి.
e-KYCని ఎలా పూర్తి చేయాలి? :
పీఎం కిసాన్ e-KYC ప్రాసెస్ చాలా ఈజీ. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ పూర్తి చేయవచ్చు. అది ఎలాగంటే?
ఆన్‌లైన్ మెథడ్ :
ఆఫ్‌లైన్ మెథడ్ :
OTP ద్వారా వెరిఫికేషన్ సాధ్యపడకపోతే రైతులు తమ సమీప కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని విజిట్ చేసి బయోమెట్రిక్స్ ద్వారా e-KYCని పూర్తి చేయవచ్చు. ఈ మొత్తాన్ని 3 సమాన వాయిదాలుగా పొందవచ్చు. అంటే ప్రతి 4 నెలలకు రూ. 2,000, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ అవుతుంది.