PM Kisan – Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ డబ్బులు రాకపోతే ఏం చేయాలి? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

PM Kisan - Annadata Sukhibhava : పీఎం కిసాన్ 23వ వాయిదా, అన్నదాత సుఖీభవ మొత్తం కలిపి రూ. 7వేలు ఈరోజు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. కానీ, మీకు ఈ రెండు పథకాల డబ్బు జమ కాకుంటే వెంటనే ఇలా చేయండి..

PM Kisan - Annadata Sukhibhava

  • రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 23వ వాయిదా విడుదల
  • ఆంధ్రప్రదేశ్ రైతన్నల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం రూ. 7వేలు 
  • ఈ చిన్న తప్పులు కూడా రావాల్సిన డబ్బులు పడవు
  • ఇలా చేశారంటే మీ డబ్బులు వెంటనే క్రెడిట్ అవుతాయి

PM Kisan – Annadata Sukhibhava : పీఎం కిసాన్ పథకం కింద రూ. 2వేలు, ఏపీ అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 7వేలు రైతుల ఖాతాల్లో పడ్డాయి. కానీ, కొంతమందికి రైతులకు (PM Kisan – Annadata Sukhibhava) డబ్బులు పడలేదని ఆందోళన చెందుతుంటారు. కారణం ఏంటో తెలియక కంగారుపడిపోతుంటారు. ఇంతకీ ఈ రైతులకు డబ్బులు ఎందుకు పడలేదంటే.. దానికి చాలా కారణాలు ఉంటాయి.

నిజానికి చిన్న తప్పుల వల్లే ఈ సమస్య వస్తుంది. అందులో ప్రధానంగా ఆధార్-బ్యాంక్ లింక్ లేకపోవడం, ఈ-కేవైసీ పూర్తి కాకపోవడం, లేదా ల్యాండ్ రికార్డ్స్ మిస్మాచ్ కావడం వంటివే ఎక్కువగా ఉంటాయి. అన్ని రూల్స్ పాటిస్తే మీ సమస్య 7 నుంచి 15 రోజుల్లో సాల్వ్ అయిపోతుంది.

మీ డబ్బు కూడా ఇలా నిలిచిపోయిందా? అయితే ముందు కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరైన దారి తెలిస్తే రైతు సబ్సిడీ మళ్లీ మీ ఖాతాలోకి వచ్చి పడుతుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్‌గా చూద్దాం..

పీఎం కిసాన్ రూ. 2వేలు పడ్డాయా?
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (జూన్ 20) పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడతను విడుదల చేశారు. ఈ కార్యక్రమం పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్‌లో నిర్వహించారు.

ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.44 కోట్లకుపైగా రైతు కుటుంబాల ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా సుమారు రూ. 18,880 కోట్లు జమ అయ్యాయి. పీఎం కిసాన్ పథకం ప్రకారం.. అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ. 6వేలు ఆర్థిక సాయం అందుతుంది. మూడు విడతలుగా రూ. 2వేలు చొప్పున ప్రతి 4 నెలలకు ఒకసారి నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ రైతులకు డబుల్ గుడ్ న్యూస్ :
ఏపీలోని రైతులకు ఈరోజు భారీ శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం నిధులు రూ. 7 వేలు జమ అయ్యాయి.

  • కేంద్రం నుంచి రూ. 2వేలు (పీఎం కిసాన్ విడత)
  • రాష్ట్రం నుంచి : రూ. 5,000 (అన్నదాత సుఖీభవ సాయం)
  • మొత్తం : ఒక్కో రైతు ఖాతాలో రూ. 7వేల వరకు జమ అయ్యే ఛాన్స్
  • ఈ మొత్తం నిధులు డీబీటీ ద్వారా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి.

అసలు సమస్య ఎక్కడంటే? :
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ డబ్బులు పడకపోవడానికి ప్రధాన కారణాలు ఈ కింది విధంగా ఉంటాయి.

  • e-KYC పూర్తి కాకపోవడం
  • బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ చేయకపోవడం
  • ల్యాండ్ రికార్డ్స్ తప్పుగా ఉండటం
  • పేర్లు స్పెల్లింగ్ మిస్‌మ్యాచ్
  • లబ్ధిదారు అర్హత లేకపోవడం

స్టేటస్ చెక్ చేయండి :
ముందుగా అధికారిక వెబ్‌సైట్ లేదంటే గ్రామ సచివాలయంలో మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి. అక్కడ ‘Rejected/Pending/On Hold’ అని చూపిస్తుంది. అక్కడ సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

Read Also : Vande Bharat First AC Coach : ప్రయాణికులకు పండగే! వందే భారత్‌ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!

e-KYC పూర్తి చేయండి :
మీ దగ్గరలోని రైతు సర్వీసు సెంటర్ లేదా గ్రామ సచివాలయంలో బయోమెట్రిక్ ద్వారా e-KYC పూర్తి చేయండి. లేదంటే మీ డబ్బులు జమ కావు.

బ్యాంక్ లింక్ చెక్ చేయండి :
ఆధార్‌తో మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా? లేదో చూసుకోండి. IFSC కోడ్ తప్పు ఉంటే వెంటనే సరిచేయండి.

ల్యాండ్ రికార్డ్స్ వెరిఫై చేయండి :
పట్టా పేరు, సర్వే నంబర్ తప్పుగా ఉంటే రెవెన్యూ అధికారులను సంప్రదించి అప్‌డేట్ చేయాలి.

సచివాలయం లేదా హెల్ప్‌లైన్ :
ఇంకా సమస్య ఉంటే.. గ్రామ సచివాలయం లేదా పీఎం కిసాన్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి. టికెట్ నంబర్ తీసుకుని ఫాలోఅప్ చేయాలి.

ఉదాహరణకు.. రమేష్‌ అనే రైతుకు కూడా ఇలాగే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రెండు విడతల డబ్బు రాలేదు. ముందుగా అతను కొంచెం ఆందోళన పడ్డాడు. కానీ, సచివాలయంలో చెక్ చేస్తే అతని e-KYC పెండింగ్‌లో ఉందని చూపించింది. ఒకే రోజు బయోమెట్రిక్ పూర్తి చేశాడు. 10 రోజుల్లో డబ్బు అకౌంట్‌లో జమ అయ్యింది. మీ సమస్య కూడా ఇలా పరిష్కరించుకోవచ్చు.

రైతులకు ముఖ్య సూచనలివే :

    • బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి
    • e-KYC పూర్తిగా ఉండాలి
    • అర్హత ఉన్న రైతులకే డబ్బు జమ
    • గ్రామ సచివాలయం లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి