PM Kisan : పీఎం కిసాన్ పై కేంద్రం బిగ్ అలర్ట్.. వీరికి డబ్బుల కట్.. వెంటనే ఇలా చేయండి..!
PM Kisan : పీఎం కిసాన్ పొందే లబ్ధిదారులైన రైతులకు కీలక అలర్ట్.. 23వ విడత డబ్బులు పడాలంటే ఈ పని కచ్చితంగా చేయాలి.
- Dharani Pilli
- Updated on- May 6, 2026 / 08:39 AM IST
PM Kisan 23rd Installment Update Central govt mandatory eKYC for Farmers to Receive Next Payment
PM Kisan : అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించి ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ.. 22వ విడత కిసాన్ నిధులను విడుదల చేశారు. జూన్, లేదా జులైలో 23వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో పీఎం కిసాన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పీఎం కిసాన్ 23వ విడత నిధులు పొందాలంటే.. ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని.. లేదంటే ఖాతాలో డబ్బులు జమ కావని తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
పీఎం కిసాన్ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకునే రైతులు.. కచ్చితంగా ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే 23వ విడత నగదు డీబీటీ విధానంలో నేరుగా అర్హులైన రైతుల అకౌంట్లో జమ కానుంది. ఈ క్రమంలో లబ్ధిదారులు అందరూ తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అలానే పీఎం కిసాన్ నిధులు పొందే రైతులు.. బ్యాంక్ అకౌంట్‌లో ఆధార్ కార్డును లింక్ చేయాలని.. మొబైల్ నంబర్ ని అప్‌డేట్ చేయించుకోవాలని సూచించారు..
ఈ పథకానికి అర్హులైన రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. మూడు పద్ధతుల్లో రైతులు ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు.
- పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా స్వయంగా చేసుకోవచ్చు.
- పీఎం కిసాన్ యాప్ ద్వారా కూడా పని పూర్తి చేయవచ్చు.
- లేదంటే అర్హులైన రైతులు కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి చేసుకోవచ్చు. ఇలా మూడు మార్గాల్లో పీఎం కిసాన్ లబ్ధిదారులు మీ కేవైసీ అనేది సులభంగా పూర్తి చేయవచ్చు.
వీరికి పీఎం కిసాన్ నిధులు కట్
ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమి కొనుగోలు చేసిన రైతులకు పీఎం కిసాన్ పథకం వర్తించదు. అలానే ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించి కేంద్రం ఎప్పటికప్పుడు రీవెరిఫికేషన్ చేపడుతోంది. అనర్హులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తుంది. అలానే ఈ సంవత్సరం కూడా అనర్హులుగా తేలిన వారిని గుర్తించి.. పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల జాబితా నుంచి వారి పేర్లు కట్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో.. ప్రతి ఏటా పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ కొంతమంది పీఎం కిసాన్ లబ్ధిదారులుగా ఉన్నారు. దీంతో ఐటీ శాఖ నుంచి వచ్చిన డేటా ఆధారంగా వారిని కేంద్రం తొలగిస్తోంది.
