PM Kisan 24th Installment :10 లక్షల మంది రైతులకు రూ. 2వేలు పడవు? పీఎం కిసాన్ లిస్ట్‌లో మీ పేరు ఉందా? ఇలా చెక్ చేసుకోండి!
PM Kisan 24th Installment : పీఎం కిసాన్ పథకంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనే వార్తల నేపథ్యంలో మీ పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ-కేవైసీ, ఆధార్ లింకింగ్, బెనిఫిషియరీ స్టేటస్ వివరాలివే..
- Sreehari A
- Published on- October 29, 2026 / 07:26 PM IST
PM Kisan 24th Installment
- రైతులకు బిగ్ షాక్.. మీకు రూ.2,000 వస్తాయా?
- పీఎం కిసాన్ 24వ విడత లబ్ధిదారుల్లో తీవ్ర ఆందోళన
- ఈ తప్పులుంటే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే
PM Kisan 24th Installment : దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.. ఈ పథకం ద్వారా పెట్టుబడి సాయం పొందుతున్న రైతులు తదుపరి విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు..
అయితే, లబ్ధిదారుల సంఖ్య తగ్గినట్లు వస్తున్న వార్తలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మరి మీ పేరు జాబితాలో ఉందా? మీ అకౌంట్లో రూ.2వేలు జమ కావాలంటే ఏం చేయాలి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పీఎం కిసాన్ డబ్బులు ఎవరికి వస్తాయి? :
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6వేలు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని 3 విడతల్లో, ఒక్కోసారి రూ.2వేలు చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. వ్యవసాయ పనులకు పెట్టుబడి సాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం..
Read Also : AP Weather Update : ఏపీకి వర్ష గండం.. కోస్తాంధ్రలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..!
10 లక్షల మంది పేర్లు తొలగించారా? :
గత విడతతో పోలిస్తే.. తదుపరి విడతలో లబ్ధిదారుల సంఖ్య తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుమారు 10 లక్షల మంది పేర్లు జాబితా నుంచి తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి.. అయితే, లబ్ధిదారుల సంఖ్యలో మార్పు కనిపించిందని మాత్రమే ఎవరినైనా అధికారికంగా తొలగించినట్లు నిర్ధారించలేం.. మీ అర్హతను అధికారిక పోర్టల్‌లో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.
ఈ తప్పులు చేస్తే డబ్బులు ఆగొచ్చు :
పీఎం కిసాన్ సాయం అందాలంటే కొన్ని ముఖ్యమైన వివరాలు సరిగ్గా ఉండాలి..
- ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేసి ఉండాలి.
- భూమికి సంబంధించిన రికార్డులు సరిగా ఉండాలి.
- బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి.
- బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉండాలి.
- వర్తించే అర్హత నిబంధనలను పాటించాలి.
- అర్హత లేని వారు, ఆదాయపు పన్ను చెల్లించే కొన్ని వర్గాలు, నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందేవారు ఈ పథకానికి అనర్హులు కావచ్చు.
మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేయండి :
పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ (https://pmkisan.gov.in)ను ఓపెన్ చేయండి. అందులో (Beneficiary Status) ఆప్షన్‌ను ఎంచుకుని అడిగిన వివరాలు ఎంటర్ చేయండి. మీ పేమెంట్ స్టేటస్, లబ్ధిదారుల వివరాలను చెక్ చేయండి..
ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉంటే దాన్ని పూర్తి చేయండి. అవసరమైతే సమీప కామన్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించండి. మీ పేరు జాబితాలో ఉందో లేదో ముందుగానే చెక్ చేసుకుంటే చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్త పడవచ్చు.
