PM Kisan 24th Installment : పీఎం కిసాన్ 24వ విడతపై బిగ్ అప్‌డేట్.. రైతుల ఖాతాల్లోకి రూ.2,000 ఎప్పుడంటే?

PM Kisan 24th Installment : పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు అక్టోబర్‌లో వస్తాయా? రైతుల ఖాతాల్లో రూ.2వేలు జమపై లేటెస్ట్ అప్‌డేట్, పేమెంట్ స్టేటస్ చెక్ చేసే విధానం, ఈ-కేవైసీ, ఆధార్ లింకింగ్ వివరాలపై ఓసారి లుక్కేయండి..

PM Kisan 24th Installment

  • పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారా?
  • రైతులకు దీపావళి గిఫ్ట్? రూ.2,000 ఎప్పుడంటే!
  • పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు ఈ నెలలోనే వస్తాయా?

PM Kisan 24th Installment : రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ లబ్ధిదారులు 24వ విడత డబ్బుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 23వ విడత అందుకున్న రైతులు.. తదుపరి విడత ఎప్పుడు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందా? అని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లోనే రూ. 2వేలు విడుదల అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో రైతుల్లో ఆశలు పెంచుతున్నాయి. అయితే, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు కచ్చితమైన తేదీపై స్పష్టత లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

పీఎం కిసాన్ 24వ విడత ఎప్పుడంటే? :
పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6వేలు ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా, ఒక్కో విడతకు రూ.2వేలు చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. సాధారణంగా 4 నెలల వ్యవధిలో విడతలు విడుదల కానున్నాయి.

24వ విడత డబ్బులు అక్టోబర్‌లో విడుదల కావచ్చని వ్యవసాయ శాఖకు చెందిన అధికారి నీలేష్ చౌరాసియా సూచించారు. దీపావళి నేపథ్యంలో రైతులకు ముందుగానే ఈ సాయం అందే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే, 24వ విడత విడుదల తేదీని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో వచ్చే తేదీలను గుడ్డిగా నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో అవ్వండి.

Read Also : Best Electric Scooters : పండక్కీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? రూ.1 లక్షలోపు టాప్ 5 ఈవీ స్కూటర్లు ఇవే.. 179 కి.మీ రేంజ్

మీ పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయో లేదో ఇలా చెక్ చేయండి
మీ పేమెంట్ వివరాలను తెలుసుకునేందుకు ఈ విధానాన్ని ఫాలో అవ్వండి.

  • ముందుగా (pmkisan.gov.in) అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
  • హోమ్‌పేజీలో ‘Know Your Status’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • స్క్రీన్‌పై కనిపించే క్యాప్చాను పూర్తి చేయండి.
  • ‘Get OTP’పై క్లిక్ చేసి వచ్చిన ఓటీపీతో వెరిఫై చేయండి.
  • మీ పేమెంట్ స్టేటస్, రిజిస్ట్రేషన్ వివరాలను చెక్ చేయండి.
  • డబ్బులు క్రెడిట్ కాకపోతే ఈ విషయాలు తప్పక చూడండి

మీ ఖాతాలో 24వ విడత జమ కాకపోతే ఏం చేయాలంటే?

ఈ-కేవైసీ : ప్రాసెస్ పూర్తయిందో లేదో చెక్ చేయండి.
భూమి వివరాలు : భూమి రికార్డుల వెరిఫికేషన్ పూర్తై ఉండాలి
ఆధార్ లింకింగ్ : బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి
రిజిస్ట్రేషన్ : మీ వివరాల్లో తప్పులు ఉన్నాయేమో చెక్ చేసి సరి చేయండి

ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారిక సేవల ద్వారా పరిష్కరించుకోండి. ముఖ్యంగా, 24వ విడత డబ్బుల విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండండి.