PNB Account Alert : PNB కస్టమర్లకు బిగ్ వార్నింగ్.. మీ అకౌంట్లు ఏ క్షణమైనా క్లోజ్ అవ్వొచ్చు.. అర్జెంట్‌గా ఇలా చేయండి..!

PNB Account holders : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ క్లోజ్ కాకుండా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి.. ఏప్రిల్ 15 వరకు మాత్రమే డెడ్ లైన్.. ఫుల్ డిటెయిల్స్

PNB Account Alert

  • పంజాబ్ నేషనల్ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్
  • ఇన్ యాక్టివ్ అకౌంట్లను క్లోజ్ చేస్తున్న బ్యాంకు
  • ఏప్రిల్ 15 వరకు కస్టమర్లకు గడువు విధించిన పీఎన్‌బీ

PNB Account holders : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కస్టమర్లకు బిగ్ అలర్ట్.. మీకు అకౌంట్ ఉందా? అసలు ఒక్కసారి కూడా అకౌంట్ వాడలేదా? అయితే ఇప్పుడే ఆ పని చేయండి. లేదంటే మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది.

ఈ మేరకు పంజాబ్ బ్యాంకు కస్టమర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. వెంటనే అకౌంట్ అప్ డేట్ చేసుకోకపోతే ఏప్రిల్ 15 తర్వాత కొన్ని బ్యాంకు అకౌంట్లు క్లోజ్ అవుతాయని హెచ్చరించింది. చాలా కాలంగా వాడని అకౌంట్లపై ఎక్కువ ప్రభావం ఉంటుందని, ఎలాంటి లావాదేవీలు, జీరో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది.

నిర్దేశిత గడువులోగా ‘నో యువర్ కస్టమర్’ (KYC) వివరాలను అప్ డేట్ చేసుకోవాలని బ్యాంకు కస్టమర్లను కోరింది. సెక్యూరిటీ కోసం ఇన్ యాక్టివ్ అకౌంట్ల దుర్వినియోగాన్ని తగ్గించేందుకు ఆయా అకౌంట్లను క్లోజ్ చేస్తున్నట్టు బ్యాంకు పేర్కొంది. బ్యాంకు ఆదేశాలను పాటించని కస్టమర్లకు తర్వాత ఎలాంటి నోటీసు లేకుండా అకౌంట్ క్లోజ్ అవుతాయని హెచ్చరించింది.

Read Also : OnePlus Nord 6 Review : గేమర్లకు పండగే.. 9000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ 6 వస్తోంది.. ఛార్జింగ్ దిగదు.. ఫోన్ హీటెక్కదు..!

క్లోజింగ్ రిస్క్‌లో ఉన్న అకౌంట్లు :
గత కొన్నేళ్లుగా కస్టమర్ల నుంచి ఎలాంటి లావాదేవీలు జరగకపోవడం, ప్రస్తుతం జీరో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లకు ఇది వర్తిస్తుందని పీఎన్‌బీ స్పష్టం చేసింది. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ఇలాంటి అకౌంట్లను ఇన్ యాక్టివ్ అకౌంట్లుగా పరిగణిస్తారు.

చాలారోజులుగా అసలు అకౌంట్లను వాడని కస్టమర్లకు ఇప్పటికే బ్యాంకు నుంచి అలర్ట్స్ వచ్చి ఉండవచ్చు. ఏప్రిల్ 15 లోగా ఎలాంటి అప్ డేట్ చేయకపోతే బహుశా మరో హెచ్చరిక లేకుండానే, ఏప్రిల్ 16 నుంచి ఇన్ యాక్టివ్‌గా ఉండే అకౌంట్లు క్లోజ్ అవుతాయి. అన్ని అకౌంట్లు ఎఫెక్ట్ కావని కేవలం ఇన్ యాక్టివ్ అకౌంట్లు, బ్యాంకు నిబంధనల పాటించని అకౌంట్లలో మాత్రమే ఈ పరిధిలోకి వస్తాయని బ్యాంకు స్పష్టం చేసింది.

బ్యాంకు అకౌంట్లు క్లోజ్ ఎందుకంటే? :
బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరచడం, ఇన్ యాక్టివ్ అకౌంట్లతో నష్టాలను తగ్గించడమే లక్ష్యం. ఇన్ యాక్టివ్ అకౌంట్లతో మోసాలు, దుర్వినియోగం, అనధికారికంగా వినియోగించే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి అకౌంట్ కేవైసీ రికార్డులను మెయింట్ చేయడం, ఖాతాదారుల వివరాలు వెరిఫై చేయడం వంటివి తప్పనిసరి చేసినట్టు పీఎన్‌బీ తెలిపింది.

కస్టమర్లు ఏం చేయాలంటే? :
అకౌంట్ క్లోజ్ కాకుండా నివారించేందుకు గడువు తేదీలోగా ఆన్‌లైన్‌లో కేవైసీ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోండి. లేదంటే బ్యాంకు బ్రాంచ్ వద్దకు వెళ్లి అప్‌డేట్ చేసుకోవచ్చు.