PNB Alert : కస్టమర్లకు బిగ్ షాక్.. ఈ PNB ఖాతాలన్నీ ఇకపై పనిచేయవు.. ఈ లిస్టులో మీ ఖాతా ఉందేమో చెక్ చేసుకోండి..

PNB Alert: పంజాబ్ నేషనల్ బ్యాంకు కస్టమర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. ఈ బ్యాంకు అకౌంట్లన్నీ క్లోజ్ అయ్యాయి. ఇందులో మీ బ్యాంకు ఖాతా ఉందేమో చెక్ చేసుకోండి.

PNB Alert

  • ఎవరి బ్యాంకు ఖాతాలు క్లోజ్ అవుతాయంటే?
  • బ్యాంకు అకౌంట్ క్లోజ్ కాకుండా ఎలా నివారించాలి?
  • ఇ-కేవైసీ చేయకున్నా లావాదేవీలు చేయకపోయినా ఖాతా పోయినట్టే

PNB Alert : పంజాబ్ నేషనల్ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా? ప్రస్తుతం ఈ అకౌంట్ మీరు వాడుతున్నారా? ఇప్పటివరకూ ఖాతాకు ఇ-కేవైసీ పూర్తి చేయలేదా? అయితే, మీ ఖాతా క్లోజ్ అయినట్టే. ఎందుకంటే.. ఏప్రిల్ 16 వరకు మాత్రమే అవకాశం ఉంది.

బ్యాంకు అకౌంట్లు ఇన్ యాక్టివ్ గా ఉండి కనీసం ఎలాంటి లావాదేవీలు చేయని అకౌంట్లు అన్నీ క్లోజ్ ఈ తేదీ నుంచి అవుతాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పటికే అనేక మంది వ్యక్తుల ఖాతాలను క్లోజ్ చేసింది. ఇంతకీ మీ అకౌంట్ కూడా క్లోజ్ అయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. లేదంటే వెంటనే ఇకేవైసీ చేయించుకోండి.

ఎవరి ఖాతాలు క్లోజ్ అవుతాయంటే? :
మీడియా నివేదికల ప్రకారం.. గత 3 ఏళ్లుగా ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉండి.. ఏ విధంగానూ వాడని వ్యక్తుల ఖాతాలను బ్యాంకు క్లోజ్ అవుతాయి. అదనంగా, ఇన్ యాక్టివ్ (inactive) అకౌంట్లు కూడా క్లోజ్ అవుతాయి. అంతేకాదు.. బ్యాంకు ఖాతాలకు ఇ-కేవైసి (e-KYC) తప్పనిసరి. ఒక వ్యక్తి ఇ-కేవైసిని పూర్తి చేయకపోతే వారి బ్యాంకు అకౌంట్ క్లోజ్ అయినట్టే.

ముఖ్యంగా బ్యాంకు నిబంధనలను పాటించని ఖాతాదారుడి అకౌంట్లు క్లోజ్ అవుతాయి. బ్యాంకులో కనీసం ఎలాంటి లావాదేవీలు లేకుండా, జీరీ బ్యాలెన్స్ ఉన్న అనేక అకౌంట్లు ఉన్నాయి. ఇలాంటి అకౌంట్లు ఎక్కువగా మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే బ్యాంకులు ఈ రకమైన ఖాతాలను క్లోజ్ చేస్తుంటాయి.

Read Also : Aadhaar Cash Withdrawal : మీ ఆధార్ కార్డుతో ఈజీగా డబ్బులు తీయొచ్చు తెలుసా? నో పిన్.. నో కార్డు.. క్యాష్ విత్‌డ్రా ప్రాసెస్ ఇదిగో..

బ్యాంకు ఖాతా క్లోజ్ కాకుండా ఏం చేయాలి? :
ముందుగా మీరు మీ ఇ-కేవైసీని పూర్తి చేయాలి. ఏప్రిల్ 16లోగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తిచేసి ఉండాలి. మీ నివాసానికి సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖలో ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి.

లేదంటే.. మీ బ్యాంకులో కొంత ఫండ్ డిపాజిట్ చేయడం ద్వారా కూడా అకౌంట్ యాక్టివేట్ చేసుకోవచ్చు. అది చిన్న లావాదేవీ అయినా సరే.. ఉదాహరణకు కనీసం రూ. 500 డిపాజిట్ చేసినా కూడా మీ అకౌంట్ క్లోజ్ కాదు.

ఈ చర్యలన్నీ మీ బ్యాంకు ఖాతా మూసివేయబడకుండా నివారించి ఉండేవి. మీరు మీ ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే, మీ బ్యాంకును సందర్శించి దాని గురించి మాట్లాడండి. బ్యాంకు ఏ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటోంది?

బ్యాంకు ఖాతాలను ఇప్పటివరకూ అప్‌డేట్ చేయని వారికి మాత్రమే ఈ సమస్య ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్లు ఉండి, కనీస బ్యాలెన్స్ లేని లేదా పూర్తిగా ఇన్ యాక్టివ్‌గా ఉన్న కస్టమర్లను కూడా బ్యాంకు గుర్తించింది. గత 3 ఏళ్లలో ఈ కస్టమర్లు తమ సమాచారాన్ని వెరిఫికేషన్ చేసేందుకు ఒక్కసారి కూడా బ్యాంకును విజిట్ చేయకపోయినా లేదా ఆన్‌లైన్‌లో కేవైసీని పూర్తి చేయకపోయినా వారి ఖాతా బ్లాక్‌లిస్ట్ అవుతుంది.