PNB Fixed Deposit : PNBలో 91 రోజుల FDపై ఎంత వడ్డీ వస్తుంది? ఎన్ని రోజులకు ఖాతా ఓపెన్ చేయొచ్చు.. ఫుల్ డిటెయిల్స్
PNB Fixed Deposit : పంజాబ్ నేషనల్ బ్యాంక్ 59 ఏళ్ల వయస్సు లోపు ఉన్న కస్టమర్లందరికీ 91 రోజుల టెన్యూర్ FD ఖాతాలపై 4.90 శాతం వడ్డీని అందిస్తోంది. పూర్తి బ్యాంకు వడ్డీ వివరాలివే..
- Sreehari A
- Updated on- August 8, 2026 / 09:04 PM IST
PNB Fixed Deposit
- సీనియర్ సిటిజన్లకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫర్లు
- పీఎన్‌బీ 91 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్, 3 నెలల్లో ఎంత వడ్డీ?
- పీఎన్‌బీ FDపై అదిరిపోయే వడ్డీ, ఎన్ని రోజులకు ఎంత రిటర్న్?
PNB Fixed Deposit : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఖాతాలపై అద్భుతమైన రాబడిని అందిస్తోంది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎఫ్‌డీ ఖాతాలపై 3.00 శాతం నుంచి 7.40 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.
ఎస్బీఐ తర్వాత కస్టమర్ల సంఖ్య పరంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశంలో (PNB Fixed Deposit) రెండో అతిపెద్ద బ్యాంకు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో FD ఖాతాలను కనీసం 7 రోజుల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల కాలపరిమితితో ఓపెన్ చేయొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోని 91-రోజుల FD ఖాతాపై ఎంత వడ్డీని అందిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
91 రోజుల FDపై బ్యాంక్ వడ్డీ ఎంతంటే? :
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 91 రోజుల FD పథకంపై 4.90శాతం నుంచి 5.70శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 59 ఏళ్ల వయస్సు వరకు ఉన్న కస్టమర్లకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ 91 రోజుల FD ఖాతాలపై 4.90శాతం వడ్డీని అందిస్తోంది.
అంతేకాదు.. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు 91 రోజుల FD పథకంపై 5.40శాతం వడ్డీని అందిస్తోంది. 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్లకు పంజాబ్ బ్యాంకు 91 రోజుల FD పథకంపై 5.70శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు కేవలం రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి.
సీనియర్ సిటిజన్లతో పోలిస్తే.. సూపర్ సీనియర్ సిటిజన్లకు PNB 0.30శాతం అధిక రాబడిని అందిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ పౌరులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్ల FD ఖాతాలపై 0.50 శాతం అధిక వడ్డీని అందిస్తుంది.
అంతేకాదు.. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇతర సీనియర్ సిటిజన్లతో పోలిస్తే.. సూపర్ సీనియర్ సిటిజన్ల FD ఖాతాలపై 0.30 శాతం అధిక వడ్డీని అందిస్తుంది. సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారుతాయని గమనించాలి.
జూన్‌లో PNB FD వడ్డీ రేట్ల సవరణ :
పంజాబ్ నేషనల్ బ్యాంక్ FD వడ్డీ రేట్లను చివరిసారిగా 2026 జూన్ 1న సవరించింది. ఆగష్టు 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా నాలుగోసారి రెపో రేటును స్థిరంగా ఉంచింది. ఆర్‌బీఐ చివరిసారిగా 2025 డిసెంబర్‌లో రెపో రేటును 0.25 శాతం తగ్గించి 5.25 శాతానికి చేర్చింది. అప్పటి నుంచి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు.
