×
Ad

Post Office Scheme : పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్.. జీరో రిస్క్‌తో పెట్టుబడి.. ప్రతి నెలా రూ. 17వేలు సంపాదించుకోవచ్చు.. ఎలాగంటే?

Post Office Scheme : ఎలాంటి రిస్క్ లేకుండా ఎక్కువ రాబడి అందించే పెట్టుబడి ప్లాన్ల కోసం చూస్తున్నారా? మీకోసం పోస్టాఫీసు అద్భుతమైన పథకాలను అందిస్తోంది. రిటైర్మెంట్ సమయంలో మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

  • Published On : February 20, 2026 / 03:41 PM IST

Post Office Scheme

  • పోస్టాఫీసులో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
  • జీరో రిస్క్ పెట్టుబడి, మీ డబ్బుకు ఫుల్ సెక్యూరిటీ
  • రిటైర్మెంట్ తర్వాత కూడా చేతినిండా డబ్బులు
  • ప్రతినెలా రూ. 17వేలకు పైగా ఆదాయం పొందొచ్చు

Post Office Scheme : పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? అయితే, ఎందులో పెట్టుబడి పెట్టాలో అర్థం కావడం లేదా? ప్రస్తుత రోజుల్లో చాలామంది తమ సంపాదనను ఏదో ఒక పెట్టుబడి పెట్టి రాబడి పొందాలని భావిస్తుంటారు. అయితే, పెట్టుబడికి ముందు డబ్బులు సేఫ్ గా ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతుంటారు. మీరు కూడా పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే మీకోసం పోస్టాఫీసులో అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి.

స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడి పెడితే రిస్క్ మాత్రమే కాదు భారీగా నష్టాలు ఉంటాయి. అదే మీరు పోస్టాఫీసులో పెట్టుబడి పెడితే మీకు జీరో రిస్క్.. పైగా పెట్టుబడిపై అధిక రాబడిని కూడా పొందవచ్చు. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత వృద్ధాప్యాన్ని హాయిగా గడపాలంటే చేతినిండా డబ్బులు ఉండాల్సిందే. రిటైర్ అయ్యాక కూడా క్రమం తప్పకుండా ఆదాయం పొందాలంటే పోస్టాఫీస్ పథకాలు చాలా బెస్ట్.

ఈ పథకాలలో పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS స్కీమ్) ఒకటి ఉంది. ఇందులో పెట్టుబడి ద్వారా ప్రతి నెలా రూ. 17వేల కన్నా ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఈ పథకాల్లో పెట్టుబడి పూర్తిగా సురక్షితం.. పైగా వడ్డీ కూడా భారీగానే వస్తుంది. అదే SCSS పథకంలో పెట్టుబడిపై ప్రభుత్వం 8.2శాతం రాబడిని అందిస్తోంది. బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్ల కన్నా కూడా ఎక్కువే.

కేవలం రూ. 1,000తో మరెన్నో టాక్స్ బెనిఫిట్స్ :
ఈ ప్రభుత్వ పథకంలో పోస్టాఫీసు ద్వారా పెట్టుబడి పెడితే కేవలం రూ. 1,000తో ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 30 లక్షలుగా ఉంటుంది. పెట్టుబడి తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చు. మీరు ఏదైనా పెట్టుబడిపై పన్ను బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం.. మీరు రూ. 1.5 లక్షల వరకు వార్షిక పన్ను మినహాయింపుగా పొందవచ్చు.

Read Also : PhonePe : ఫోన్‌పేలో అద్భుతమైన ఫీచర్.. UPI పిన్ అక్కర్లేదు.. మీ ఫింగర్ ఫ్రింట్‌తోనే పేమెంట్లు చేయొచ్చు..!

పెట్టుబడిపై వయోపరిమితి సడలింపు :
ఈ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడితో రిటైర్మెంట్ తర్వాత డబ్బుకు కొరత ఉండదు. వయోపరిమితి విషయానికొస్తే.. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా లేదా జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

కొన్ని సందర్భాల్లో సడలింపుకు కూడా నిబంధనలు ఉన్నాయి. VRS తీసుకునే వ్యక్తి అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో 55 ఏళ్లు లేదా 60 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉండవచ్చు. రిటైర్మెంట్ అయిన రక్షణ సిబ్బంది 50ఏళ్లు, 60 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉంటే పెట్టుబడి పెట్టవచ్చు.

మెచ్యూరిటీ 5 ఏళ్లు మాత్రమే :

పోస్టాఫీస్ SCSSలో పెట్టుబడి మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. ఒకవేళ ఖాతాదారుడు మొత్తం మెచ్యూరిటీ కాలం వరకు పెట్టుబడి పెడితేనే ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందవచ్చు. ఈ ప్రభుత్వ పథకంలో ప్రతి 3 నెలలకు పెట్టుబడిపై వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తుంది.

అయితే, ఖాతాదారుడు ఈ పరిమితికి ముందు అకౌంట్ క్లోజ్ చేస్తే నియమాల ప్రకారం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ కాలం ముగిసేలోపు ఖాతాదారుడు మరణిస్తే అకౌంట్ కూడా క్లోజ్ అవుతుంది. అకౌంటులో మొత్తాన్ని డాక్యుమెంట్లలో పేర్కొన్న విధంగా నామినీకి చెందుతుంది.

నెలకు రూ.17వేలు సంపాదన ఎలా? :

పోస్టాఫీసులో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ ఈజీగా ఓపెన్ చేయొచ్చు. సింగిల్ అకౌంటులో ఒకేసారి రూ.15 లక్షలు, జాయింట్ అకౌంటులో గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

సాధారణ నెలవారీ ఆదాయం రూ.17వేలుగా లెక్కిస్తే.. పోస్టాఫీసు SCSS జాయింట్ అకౌంట్లలో రూ.25 లక్షలుపెట్టుబడి పెడితే వారికి 5 ఏళ్ల పాటు త్రైమాసిక ప్రాతిపదికన రూ.51,250 వడ్డీ మాత్రమే లభిస్తుంది. 5 ఏళ్ల తర్వాత మీరు రూ.30 లక్షలు అసలు మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. లేదంటే మరో 3 ఏళ్ల పాటు పొడిగించవచ్చు. అప్పుడు మీ నెలవారీ ఆదాయం ఆధారంగా లెక్కిస్తే..

  • ఏకమొత్తం పెట్టుబడి రూ. 25 లక్షలు
  • పెట్టుబడిపై వడ్డీ రేటు 8.2 శాతం
  • పెట్టుబడిపై మొత్తం వడ్డీ (5 సంవత్సరాలు) రూ. 10,25,000
  • వార్షిక వడ్డీ ఆదాయం రూ. 2,05,000
  • త్రైమాసిక వడ్డీ ఆదాయం రూ. 51,250
  • నెలవారీ వడ్డీ నుంచి ఆదాయం రూ.17,083

మీరు ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రభుత్వం త్రైమాసిక సవరణ ప్రకారం వడ్డీ రేట్లను తరువాత మార్చినప్పటికీ మీ మెచ్యూరిటీ కాలానికి అదే వడ్డీ రేటు వర్తిస్తుంది.

Disclaimer : పోస్టాఫీసులో పెట్టబడిపై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఇందులో పెట్టుబడి పెట్టేముందు మీకు తెలిసిన ఆర్థిక నిపుణులు లేదా దగ్గరలోని పోస్టాఫీసును సంప్రదించండి.