Gold Rate Fluctuations: పసిడి పరుగుకు బ్రేక్ పడేనా?.. ఇప్పుడు బంగారం కొనాలా? ఆగాలా? నిపుణుల సంచలన విశ్లేషణ!

ప్పుడు పసిడిని(Gold Rate Fluctuations) కొనుగోలు చేయాలా లేక ధరలు తగ్గే వరకు వేచి చూడాలా అనే సందేహం ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది.

Present gold rates and fluctuations guide should you buy or wait now

  • పసిడి ధరలలో తీవ్ర హెచ్చుతగ్గులు
  • ఒకేసారి మొత్తం పెట్టుబడి వద్దు
  • విడతలవారీ కొనుగోలే సురక్షిత వ్యూహం

Gold Rate Fluctuations: ప్రస్తుత మార్కెట్‌లో బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో, ఇప్పుడు పసిడిని కొనుగోలు చేయాలా లేక ధరలు తగ్గే వరకు వేచి చూడాలా అనే సందేహం ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. 2026 ప్రారంభం నుంచే పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. జనవరిలో రికార్డు స్థాయికి ఎగబాకిన బంగారం, మార్చి నాటికి ఊహించని విధంగా 23 శాతం వరకు కరెక్షన్‌కు గురైంది. అయితే, ఆగస్టు నాటికి మళ్లీ రీబౌండ్ అవుతూ పెరుగుదల బాట పట్టడం వినియోగదారుల్లో అయోమయాన్ని క్రియేట్ చేస్తోంది.

Ai Fires Human: ఇక మనుషులపై Ai పెత్తనం.. లేట్ వచ్చారని జాబ్ నుంచి తీసేసింది.. శాన్‌ఫ్రాన్సిస్కోలో విచిత్ర ఘటన

ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలు:

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న ఆర్థిక మార్పులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువలో కదలికలు బంగారం(Gold Rate Fluctuations) ధరలను ప్రధానంగా ప్రభావితం చేస్తున్నాయి. అనిశ్చిత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు పసిడిని సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడటంతో పాటు సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కూడా ధరల ర్యాలీకి బలాన్ని ఇస్తున్నాయి.

పెట్టుబడిదారులు పాటించాల్సిన కీలక వ్యూహం:

బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు మొత్తం డబ్బును ఒకేసారి వెచ్చించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మార్కెట్ టైమింగ్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి విడతలవారీగా కొనుగోలు చేయడం అత్యుత్తమ విధానం. అలాగే ఆభరణాల కొనుగోలును, పెట్టుబడిని ఎప్పుడూ కలపకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడే లక్ష్యమైతే గోల్డ్ ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ లేదా బాండ్ల వైపు మొగ్గు చూపడం మంచిది.

ఆభరణాల అవసరానికి సరైన నిర్ణయం:

వివాహాలు లేదా ఇతర కుటుంబ వేడుకల కోసం ఆభరణాలు కొనాల్సి వస్తే ధరలు తగ్గుతాయనే ఆశతో వాయిదా వేయకుండా అవసరాన్ని బట్టి కొనుగోలు చేయడమే మేలు. పెట్టుబడిదారులు తమ మొత్తం పోర్ట్‌ఫోలియోలో బంగారానికి 10 శాతం వరకు మాత్రమే కేటాయించాలి. సరైన రోజున కొనడం కంటే, సరైన వ్యూహంతో కొనుగోలు చేయడం ద్వారానే పసిడి పెట్టుబడుల్లో లాభాలను పొందడం సాధ్యమవుతుంది.