×
Ad

BANK FD Rates : FD పెట్టుబడిదారులకు పండగే.. SBI, PNB, BoB, ఇండియన్ బ్యాంక్ 444 రోజుల FD రేట్లు, ఏ బ్యాంకులో రాబడి ఎంతంటే?

PNB FD Rates : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) స్పెషల్ FD వడ్డీ రేట్లను సవరించింది. పీఎన్‌బీ కొత్త FD వడ్డీ రేట్లతో పాటు ఇతర బ్యాంకుల FD వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

  • Published On : February 26, 2026 / 06:27 PM IST

revised FD interest rates

  • ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
  • ఫిబ్రవరి 24, 2026 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి
  • 444-రోజుల స్కీమ్ సాధారణ పౌరులకు అత్యధిక FD రేటు 6.60 శాతం
  • సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్లు 7.10శాత, 7.40శాతం వడ్డీ
  • ఎస్బీఐ, కెనారా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ వడ్డీ రేట్లు

BANK FD Rates : పంజాబ్ నేషనల్ బ్యాంకు కస్టమర్లకు బిగ్ గుడ్ న్యూస్. మీ డబ్బును పెట్టుబడి పెట్టేందుకు ఇదే బెస్ట్ టైమ్. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజట్లతో పెట్టుబడి పెట్టేవారు తప్పనిసరిగా వివిధ బ్యాంకుల FD వడ్డీ రేట్ల గురించి తెలుసుకుని ఉండాలి.

ఆ తర్వాత అధిక వడ్డీ రేట్లను అందించే బ్యాంకుతో FDలో పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు, దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ( PNB) స్పెషల్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను సవరించి కొత్త రేట్లను విడుదల చేసింది. PNB కొత్త FD వడ్డీ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పీఎన్‌బీ FD వడ్డీ రేట్లలో మార్పు :
పీఎన్‌బీ FD వడ్డీ రేట్లను సవరించింది. ఇప్పుడు సాధారణ పౌరులకు 3 శాతం నుంచి 6.60 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు 3.50 నుంచి 7.10 శాతం వరకు ఉంటాయి. సూపర్ సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు 3.80 నుంచి 7.40 శాతం వరకు ఉంటాయి. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 24, 2026 నుంచి అమల్లోకి వస్తాయి.

పీఎన్‌బీ 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లు :
పీఎన్‌బీ తమ కస్టమర్లకు 444 రోజుల FDలపై అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ FD వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

  • సాధారణ పౌరులు : 6.60 శాతం
  • సీనియర్ సిటిజన్లు : 7.10 శాతం
  • సూపర్ సీనియర్ సిటిజన్ : 7.40 శాతం

పంజాబ్ నేషనల్ బ్యాంకు FD ఇతర వడ్డీ రేట్లు

  • 1 ఏడాదికి 6.25 శాతం
  • 2 ఏళ్లకు 6.30 శాతం
  • 3 ఏళ్లకు 6.30 శాతం
  • 4 ఏళ్లకు 6.10 శాతం
  • 5 ఏళ్లకు 6.10 శాతం
  • 10 ఏళ్లకు 6 శాతం

ఇతర బ్యాంకుల్లో FD వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే? :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ వంటి అనేక ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు 444 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. SBI, PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ 444 రోజుల FDపై అందిస్తున్న వడ్డీ రేట్లను ఓసారి పోల్చి చూద్దాం..

Read Also : Best Budget Cars : కొత్త కారు కొంటున్నారా? మీ రూ. 40వేల జీతానికి ఈ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు చాలా బెస్ట్..!

బ్యాంక్ ఆఫ్ బరోడా :
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)స్క్వేర్ డ్రైవ్ డిపాజిట్ పథకాన్ని 444 రోజుల కాలానికి అందిస్తోంది. సాధారణ పౌరులకు 6.45శాతం, సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం వడ్డీ రేటుతో అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు జనవరి 5, 2026 నుంచి అమలులోకి వస్తాయి.

ఇండియన్ బ్యాంక్ :
ఇండియన్ బ్యాంక్ ఇండ్ సెక్యూర్ (444 రోజులు) ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం సాధారణ పౌరులకు 6.45 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 4, 2026 నుంచి అమలులోకి వస్తాయి.

ఎస్బీఐ :
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రత్యేక కాలపరిమితి పథకం “అమృత్ వృష్టి” (444 రోజులు) వడ్డీ రేటు సాధారణ పౌరులకు 6.45శాతం, సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం. ఈ సవరించిన రేట్లు డిసెంబర్ 15, 2025 నుంచి వర్తిస్తాయి.

కెనరా బ్యాంక్ :
కెనరా బ్యాంక్ 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. సాధారణ పౌరులకు సంవత్సరానికి 6.45 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం అందిస్తుంది. ఈ సవరించిన రేట్లు జనవరి 5, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి.