PVR INOX Offer : పీవీఆర్‌ Inox బంపర్ ఆఫర్.. కేవలం రూ.1కే స్పెషల్ షో చూడొచ్చు.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!

PVR INOX Offer : సమ్మర్ సీజన్‌లో మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూడాలని ఉందా? ఇదే సరైన అవకాశం.. పీవీఆర్ (PVR INOX) స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్పెషల్ ఆఫర్ ద్వారా ఆసక్తిగల వారు మల్టీపెక్స్ స్ర్కీన్లలో ప్రత్యేకమైన స్ర్కీనింగ్ షోలను వీక్షించవచ్చు.

PVR Inox is offering a special 30-minute screening show at Rs 1, details here

PVR INOX Offer : సమ్మర్ సీజన్‌లో కొత్త సినిమాలను మల్టీపెక్స్ వంటి పెద్ద స్ర్కీన్లలో చూడాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. కానీ, కొందరు మాత్రమే చూస్తుంటారు. ఎందుకంటే.. సాధారణ సినిమా థియేటర్లలో కన్నా అధిక టికెట్లు ఉండటమే.. అలాంటిది.. మల్టీపెక్సుల్లో పెద్ద స్ర్కీన్లపై సినిమాలను చూసే అవకాశం వస్తే ఎవరైనా వద్దనుకుంటారా? అలాంటి అరుదైన అవకాశం ఇప్పుడు వచ్చింది. ప్రముఖ మల్టీఫ్లెక్స్ అయిన పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) బంపర్ ఆఫర్ ప్రకటించింది.

కేవలం రూ.1 ఖర్చుతో మల్టీపెక్స్ స్ర్కీన్‌పై స్పెషల్ షోలను చూడవచ్చు. మల్టీప్లెక్స్‌లపై ప్రజల్లో ఆసక్తిని పెంచడంలో భాగంగా సమ్మర్ సీజన్‌లో విడుదల అయ్య సినిమాల కోసం ముందస్తుగా బుకింగ్స్ పెంచుకోవడమే లక్ష్యంగా ఈ స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. వినియోగదారులను ఎక్కువ మొత్తంలో మల్టీప్లెక్సులకు రప్పించేందుకు ఈ దిశగా ప్రయత్నాలు చేపట్టింది. అందులోభాగంగానే ప్రపంచ-మొదటి ఫీచర్‌ను అతి తక్కుధ ధరలకు అందించాడమే దీని ఉద్దేశమని PVR INOX సహ-CEO, అలోక్ టాండన్ ఒక ప్రకటనలో తెలిపారు.

Read Also : Samsung Galaxy M14 5G : శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ధర కేవలం రూ. 13,490 మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి!

ముఖ్యంగా, కొత్త ట్రైలర్ షో.. ఏప్రిల్ 7 నుంచి దేశవ్యాప్తంగా PVR, INOX మల్టీప్లెక్స్‌లలో (దక్షిణ భారత్‌లోని ధర-నియంత్రిత మార్కెట్‌లను మినహాయించి) ప్రదర్శించనుంది. కంపెనీ ప్రకారం, ఈ స్పెషల్ షో వారాంతాల్లో 50-100శాతం సామర్థ్యంతో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఇలాంటి షో ద్వారా ప్రజల నుంచి అద్భుతమైన స్పందనను పొందామని, ప్రారంభం నుంచే దాదాపు 35వేల నుంచి 40వేల మంది ప్రజలు ఇప్పటికే ఈ షోలను ఆస్వాదించారని సీఈఓ టాండన్ అన్నారు.

PVR Inox is offering a special 30-minute screening show at Rs 1

కేవలం రూ. 1 మాత్రమే ఎందుకు వసూలు చేస్తున్నారు అనేదానిపై (PVR INOX) Co-CEO గౌతమ్ దత్తా వివరణ ఇచ్చారు. తక్కువ ధరకే టికెట్ అంటే.. వినియోగదారులు సినిమా థియేటర్‌లకు వస్తారని అన్నారు. ఈ ధరపై కేవలం 4 సినిమా ట్రైలర్‌లను మాత్రమే చూస్తారని వెల్లడించారు. దీనిని టికెటెడ్ షోగా మార్చేందుకు ఒక రూపాయి మాత్రమే ఛార్జ్ చేస్తున్నట్టు తెలిపారు. తద్వారా భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే కాకుండా మధ్యలో చిన్న సినిమాలకు కూడా భారీ ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. రాబోయే కొద్ది నెలల్లో ఈ ప్రయత్నం మరింత ఫలితాలను అందిస్తుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.

ఈ ప్రత్యేక ట్రైలర్ స్క్రీనింగ్ సమయంలో ప్రేక్షకులకు చూపించాల్సిన ట్రైలర్‌లను PVR ఐనాక్స్ ఆప్షన్ ఇస్తుంది. ఈ ట్రైలర్‌లు రాబోయే బాలీవుడ్, హాలీవుడ్, ఇతర ప్రాంతీయ చిత్రాలను ఆయా ప్రాంతానికి అనుగుణంగా ప్రదర్శిస్తాయి. సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్ నటించిన పొన్నియిన్ సెల్వన్: పార్ట్-2, షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ వంటి కొన్ని సినిమాలు మే, జూన్‌లలో రిలీజ్ కానున్నాయి. ఈ ట్రైలర్ షోలు అన్ని ప్రధాన సినిమా థియేటర్లలో ప్రైమ్ టైమ్ స్లాట్‌లలో ప్రదర్శించనున్నారు. ఈ టిక్కెట్లను బాక్స్ ఆఫీస్ వద్ద లేదా PVR, INOX వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే..
– PVR లేదా INOX వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం లేదా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆయా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
– మీరు చూడాలనుకునే మూవీ పేరు, షో సమయాన్ని ఎంచుకోండి.
– సీటింగ్ చార్ట్ నుంచి మీకు ఇష్టమైన సీట్లను ఎంచుకోండి.
– మీ వ్యక్తిగత, పేమెంట్ సమాచారాన్ని రిజిస్టర్ చేసుకోండి.
– పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయండి. మీ టిక్కెట్ Confirm చేసుకోండి.
– ట్రైలర్ షోలో ఎంట్రీ కోసం సినిమా వద్ద మీ టిక్కెట్‌ను చూపించాల్సి ఉంటుంది.
– మీరు PVR Inox టిక్కెట్ విండో నుంచి కూడా నేరుగా టిక్కెట్‌ను కొనుగోలు చేయవచ్చు.

Read Also : Best Laptops 2023 : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? రూ.80వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే.. మీకు నచ్చిన మోడల్ ఎంచుకోండి..!