RBI Repo Rate : లోన్ తీసుకున్నవారికి బిగ్ న్యూస్.. రెపో రేటుపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. EMI భారం పెరుగుతుందా? తగ్గుతుందా?

RBI Repo Rate : ఆర్బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. నాల్గోసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. తద్వారా లోన్లు తీసుకున్నవారికి ఎలాంటి అదనపు ఈఎంఐ భారం ఉండదు..

RBI Repo Rate

  • గృహ రుణం లేదా వాహన రుణం తీసుకున్నారా?
  • రెపోరేటు యథాతథం.. 5.25 శాతం వద్దే కొనసాగింపు
  • ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక నిర్ణయం

RBI Repo Rate : హోం లోన్, కారు లోన్, పర్సనల్ లోన్ తీసుకున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. రెపో రేటుపై ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్ష (MPC)లో రెపో రేటుపై కీలక నిర్ణయం తీసుకుంది. అందరూ ఊహించినట్టుగానే ఈసారి కూడా ఆర్బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు.

ప్రస్తుతం ఉన్న 5.25 శాతం వద్దే రెపోరేటును యథాతథంగా కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. దాంతో ప్రస్తుతం (RBI Repo Rate) బ్యాంకుల రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే పరిస్థితి లేదు. అలాగే ఈఎంఐలు కూడా యథాతథంగా కొనసాగనున్నాయి.

ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం (ఆగస్టు 5) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించారు. వరుసగా నాలుగోసారి రెపో రేటును మార్చకుండా కొనసాగించడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ సమీక్షల్లో కూడా సెంట్రల్ బ్యాంకు రెపో రేటుపై ఇదే నిర్ణయం తీసుకుంది.

ఈఎంఐలు పెరుగుతాయా? :

రెపో రేటులో ఎలాంటి పెంపు లేదు.. అంటే.. బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను (RBI Repo Rate) పెంచాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో హోమ్ లోన్ లేదా ఇతర లోన్లు తీసుకున్నవారి ఈఎంఐలు ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేనట్టే.. అయితే, బ్యాంకు లోన్ విధానం, రిస్క్ ప్రీమియం వంటి అంశాల ఆధారంగా స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

రుణదారులకు బెనిఫిట్ ఏంటి? :
రెపో రేటు స్థిరంగా ఉంటే.. ఇప్పటికే లోన్లు చెల్లిస్తున్నవారిపై అదనపు భారం పడదు. కొత్తగా లోన్ తీసుకోవాలనుకునేవారికి కూడా ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లపైనే లోన్ వస్తుంది. అంటే.. ఈఎంఐల రూపంలో అదనపు ఖర్చు పెరగదు అనమాట.

గత ఏడాదిలో భారీగా తగ్గిన రెపో రేటు :

2025లో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లలో వరుసగా కోతలు విధించింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షల్లో చెరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. జూన్‌లో మరో 50 బేసిస్ పాయింట్ల కోత విధించింది. అనంతరం డిసెంబరులో మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తద్వారా ఏడాది మొత్తం రెపో రేటు 1.25 శాతం మేర తగ్గింది.

అలాగే, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటును 5 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటును 5.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుని ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టనుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.

జీడీపీ వృద్ధి అంచనా పెంపు :
దేశ ఆర్థిక వ్యవస్థపై 2026–27 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. తొలి త్రైమాసిక వృద్ధి అంచనాను 7 శాతానికి, రెండో త్రైమాసిక అంచనాను 6.4 శాతానికి సవరించింది.

మూడో, నాలుగో త్రైమాసికాల అంచనాలను వరుసగా 6.5 శాతం, 6.8 శాతం వద్ద ఆర్‌బీఐ కొనసాగించింది. మొత్తంగా పరిశీలిస్తే.. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచి ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వాలన్న లక్ష్యంతో ఆర్‌బీఐ మరోసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఈ నిర్ణయం ప్రస్తుతానికి రుణగ్రహీతలకు భారీ ఊరటగా చెప్పొచ్చు.