RBI Repo Rate : లోన్ ఈఎంఐ కట్టేవారికి బిగ్ షాక్? మళ్లీ పెరగనున్న వడ్డీ రేట్లు.. ఈసారి ఎంతంటే?
RBI Repo Rate : 2027 ఫిబ్రవరి నాటికి ఆర్బీఐ రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని ఎంకే గ్లోబల్ అంచనా వేసింది. వడ్డీ రేట్లు పెరిగితే హోమ్ లోన్ ఈఎంఐలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనేది పూర్తి వివరాలతో ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- October 25, 2026 / 03:47 PM IST
Big Shock for Loan EMI Payers
RBI Repo Rate : లోన్ తీసుకున్నారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్.. ఇకపై ఈఎంఐ భారం పెరగనుంది. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఈఎంఐల భారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్నవారికి మరోసారి వడ్డీ రేట్లు పెరగనున్నాయనే నేపథ్యంలో రుణగ్రహీతల్లో ఆందోళనకు దారితీస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది రెపో రేటుపై భారీ అంచనాలు నెలకొనడంతో లోన్ తీసుకున్నవారి పరిస్థితి ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది.
ఆర్థిక సేవల సంస్థ ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా ప్రకారం.. 2027 ఫిబ్రవరి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరగడం, దిగుమతి వ్యయాలు అధికమవడం, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ఈ అంచనాలకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అయితే, ఇది ఆర్థిక సంస్థ అంచనాలు మాత్రమే. లోన్లపై వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించి ఆర్బీఐ నుంచి అధికారిక నిర్ణయం రావాల్సి ఉంది.
బ్యాంకుల రుణ వడ్డీ రేట్లపై ప్రభావం :
రెపో రేటులో మార్పులతో బ్యాంకుల రుణ వడ్డీ రేట్లపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో హోమ్ లోన్లు తీసుకున్నవారిపై అధిక ప్రభావం ఉండే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు పెరిగితే నెలవారీ ఈఎంఐ పెరగవచ్చు. లోన్ తిరిగి చెల్లించే కాలపరిమితి పెరగొచ్చు.. అయితే ప్రతి రుణగ్రహీతపై ప్రభావం ఒకేలా ఉండదు. వారి లోన్ అగ్రిమెంట్, వడ్డీ రేటు విధానం, బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
Read Also : Gold Silver Prices Today : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు ఢమాల్..! తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
అందుకే లోన్ తీసుకున్నవారు ఇప్పటి నుంచే తమ నెలవారీ బడ్జెట్ను చెక్ చేసుకోవడం బెటర్. అవసరమైన ఖర్చులను నియంత్రించడంతో పాటు ఎమర్జెన్సీ ఫండ్ కూడా రెడీ చేసుకోవాలి. వడ్డీ రేట్లలో మార్పులు వచ్చినప్పుడు బ్యాంకును సంప్రదించి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను తెలుసుకోవచ్చు.
మొత్తానికి, 2027లో రెపో రేటు పెరుగుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ, తుది నిర్ణయం ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్షలపైనే ఆధారపడి ఉంటుంది. ఈఎంఐలు చెల్లించేవారు ఆందోళన చెందకుండా అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయడమే బెటర్..
