RBI Repo Rate Hike : ఆర్‌బీఐ రెపో రేటు పెంపు తప్పదా? మీ హోం లోన్ ఈఎంఐలు భారీగా పెరగొచ్చు..!

RBI Repo Rate Hike : ఆర్‌బీఐ రెపో రేటు పెరిగే ఛాన్స్ ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. చమురు ధరలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో రెపో రేటు పెరిగితే హోమ్ లోన్ సహా ఫ్లోటింగ్ రేట్ రుణాల ఈఎంఐలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published on- September 15, 2026 / 07:07 PM IST

RBI Repo Rate Hike

  • ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపునకు రెడీనా?
  • డిసెంబర్‌లో రెపో రేటు పెంపు?
  • రుణగ్రహీతలకు పెరగనున్న భారం
  • లోన్ తీసుకున్న వారికి ఈఎంఐ టెన్షన్

RBI Repo Rate Hike : లోన్లు తీసుకున్నారా? హోం లోన్లు ఇతర ఏదైనా లోన్ రుణం తీసుకున్నారా? ఆర్బీఐ రెపో రేటుపై కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటివరకూ ప్రతిసారి మానిటరింగ్ పాలసీ సమావేశంలో రెపో రేటును యథాతథంగా ఉంచుతూ వచ్చింది. ఈసారి అలా ఉండకోవచ్చు.. నివేదికల ప్రకారం.. ఆర్బీఐ రెపో రేటును పెంచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే రుణాలు తీసుకున్న వారికి మరోసారి ఈఎంఐ భారం పెరగనుంది.

పెరుగుతున్న ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణంపై ఆందోళనల నేపథ్యంలో ఆర్‌బీఐ రెపో రేటును పెంచే అవకాశం ఉందన్న అంచనాలు బలపడుతున్నాయి. పలువురు ఆర్థికవేత్తలు డిసెంబర్ నాటికి రేటు పెంపు ఉండొచ్చని భావిస్తున్నారు. పరిస్థితులు మరింత తీవ్రంగా మారితే అక్టోబర్ పాలసీ సమీక్షలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు.

డిసెంబర్ నాటికి రెపో రేటు పెరగొచ్చు :
తొమ్మిది మంది ఆర్థికవేత్తలు, ట్రెజరీ చీఫ్‌లతో నిర్వహించిన సర్వేలో ఎక్కువ మంది డిసెంబర్ నాటికి రెపో రేటు పెరగవచ్చని అంచనా వేశారు. మొదట 25 బేసిస్ పాయింట్ల పెంపు, ఆ తర్వాత 2027 ఫిబ్రవరిలో మరో 25 బేసిస్ పాయింట్ల పెంపు ఉండొచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ రెండు పెంపులు జరిగితే.. రెపో రేటు 5.75 శాతానికి చేరే ఛాన్స్ ఉంటుంది.

Read Also : Advance Tax Deadline : అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారా? సెప్టెంబర్ 15 డెడ్‌లైన్.. ఇలా చేస్తే వడ్డీ తప్పించుకోవచ్చు!

ప్రధానంగా ముడిచమురు ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి పెరగవచ్చు. ఇది ఇతర వస్తువుల ధరలపైనా ప్రభావం చూపే ఛాన్స్ కనిపిస్తోంది.

4082 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం :
ఇప్పటికే సీపీఐ (CPI) ద్రవ్యోల్బణం జూలైలో 4.45 శాతం నుంచి ఆగస్టులో 4.82 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం పెరిగితే దాన్ని అదుపులో ఉంచేందుకు ఆర్‌బీఐ కఠిన వైఖరి అవలంబించాల్సి రావచ్చు.

రెపో రేటు పెరిగితే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫ్లోటింగ్-రేట్ హోమ్ లోన్లు, ఇతర రుణాలపై ఈఎంఐలు పెరుగుతాయి. అలాగే, రుణ కాలపరిమితి పొడిగింపు ఉండొచ్చు. అందుకే రాబోయే నెలల్లో లోన్ తీసుకోవాలనుకునేవారు వడ్డీ రేట్లను బట్టి తీసుకోవడం బెటర్..