Realme GT Pro 7 : హోలీ డిస్కౌంట్ అదిరింది.. రూ.60వేల రియల్‌మి గేమింగ్ ఫోన్ కేవలం రూ. 36,500 మాత్రమే.. డోంట్ మిస్!
Realme GT Pro 7 Discount : రియల్‌మి ఫోన్ కొంటున్నారా? ఈ గేమింగ్ ఫోన్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ప్రో మోడల్ అర్హత గల కొనుగోలుదారులు మాత్రమే సొంతం చేసుకోగలరు.

Realme GT Pro 7 Discount
Realme GT Pro 7 Discount : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో పవర్‌ఫుల్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం. మీకోసం అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. రియల్‌మి గత ఏడాది నవంబర్‌లో GT 7 Proని లాంచ్ చేసింది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
అద్భుతమైన 6.78-అంగుళాల శాంసంగ్ ఎకో2 స్కై అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 16GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో పాటు 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ప్రారంభ బేస్ మోడల్ ధర రూ. 59,999గా ఉండగా, ఇప్పుడు అమెజాన్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ వాల్యూ ద్వారా కొనుగోలు చేసేవారికి అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు.
రియల్‌మి GT7 ప్రో డిస్కౌంట్ :
రియల్‌మి GT7 ప్రో ఫోన్ 12GB ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో రియల్‌మి జీటీ 7ప్రో రూ.59,999కు రిటైల్ అవుతుంది. అయితే, అమెజాన్ ప్రస్తుతం 21 శాతం తగ్గింపును అందిస్తోంది. తద్వారా రియల్‌మి ఫోన్ ధర రూ.54,998కి తగ్గింది. అదనంగా, స్మార్ట్‌ఫోన్‌పై మరో రూ.2వేల తగ్గింపు అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.52,998కి తగ్గింది. కొన్ని బ్యాంకులు క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,500 వరకు తగ్గింపును కూడా అందిస్తున్నాయి.
రియల్‌మి ధర రూ.51,498కి తగ్గవచ్చు. అంతేకాకుండా, అమెజాన్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా రూ.30,350 వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా దాదాపు రూ.15వేలు అయితే, మీరు కేవలం రూ.36,498కే రియల్‌మి GT 7 ప్రో పొందవచ్చు. వాస్తవ ఎక్స్ఛేంజ్ విలువ మీ పాత ఫోన్ స్టేటస్‌పై ఆధారపడి ఉంటుందని గమనించాలి.
రియల్‌మి జీటీ 7 ప్రో స్పెసిఫికేషన్లు :
రియల్‌మి జీటీ 7 ప్రో ఆకట్టుకునే 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. FHD+ రిజల్యూషన్, మృదువైన 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఐపీ69 రేటింగ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ దుమ్ము, నీటిలో పడినా తట్టుకునేలా రూపొందింది.
ముఖ్యంగా, భారత మార్కెట్లో పవర్‌ఫుల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చిన ఫస్ట్ ఫోన్ కూడా. ఈ చిప్‌సెట్ 16GB వరకు LPDDR5X RAMతో వస్తుంది. 512GB స్టోరేజీ, వేగవంతమైన UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.
ఫోటోగ్రఫీ పరంగా రియల్‌మి GT 7 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో సోనీ ఐఎమ్ఎక్స్906ని కలిగిన 50MP ప్రైమరీ సెన్సార్, సోనీ IMX882తో కూడిన 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ ప్రియుల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. బాక్స్ వెలుపల ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది.